10 నిమిషాల్లో అపస్మారక స్థితిలోకి, అరగంట పీల్చితే మరణమే.. మోస్ట్ డేంజరస్ గ్యాస్ స్టైరిన్

స్టెరిన్(styrene) కెమికల్ గ్యాస్. ఏపీలో హాట్ టాపిక్ గా మారిన గ్యాస్ ఇది. విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ కెమికల్

  • Published By: naveen ,Published On : May 7, 2020 / 07:14 AM IST
10 నిమిషాల్లో అపస్మారక స్థితిలోకి, అరగంట పీల్చితే మరణమే.. మోస్ట్ డేంజరస్ గ్యాస్ స్టైరిన్

స్టెరిన్(styrene) కెమికల్ గ్యాస్. ఏపీలో హాట్ టాపిక్ గా మారిన గ్యాస్ ఇది. విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ కెమికల్

స్టెరిన్(styrene) కెమికల్ గ్యాస్. ఏపీలో హాట్ టాపిక్ గా మారిన గ్యాస్ ఇది. విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ కెమికల్ ప్లాంట్ లో లీక్ అయిన కెమికల్ గ్యాస్ ఇదే. దీని కారణంగా విశాఖలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. వేల మంది అస్వస్థతకు గురయ్యారు. పలువురు చనిపోయారు. అనేక మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. చెట్లు మాడిపోయాయి. మూగజీవాలు మృత్యువాడ పడ్డాయి.

అసలు ఈ స్టెరిన్ గ్యాస్ ఏంటి? ఎందుకంత డేంజర్? దాని వల్ల జరిగే నష్టం ఏంటి? ఈ గ్యాస్ చాలా డేంజర్ అని నిపుణులు అంటున్నారు. స్టెరిన్ గ్యాస్ గాల్లో కలిస్తే ప్రమాదం అని, ప్రాణాలు పోతాయని చెప్పారు. స్టెరిన్ గ్యాస్ మెదడు, నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుందన్నారు. ఈ గ్యాస్ పీల్చిన వారు 10 నిమిషాల్లో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతారు. ఈ గ్యాస్ ను అరగంట పీల్చితే మరణమే. క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు.

* స్టెరిన్ గ్యాస్ ప్రాణాంతకం
* పీల్చిన వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
* మెదడు, నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది
* లాంగ్ టర్మ్ లో స్టెరిన్ గ్యాస్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం
* గాల్లో ఆక్సిజన్ స్థాయి తగ్గిపోతుంది
* ఇది పీల్చిన వారికి ఆక్సిజన్ అందదు
* ఆక్సిజన్ అందక అవయవాలు దెబ్బతింటాయి
* పీల్చిన గ్యాస్ పరిమాణాన్ని బట్టి ప్రభావం
* 10 నిమిషాల్లో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతారు
* అరగంట పీల్చితే మరణమే
* గాల్లో ఈ గ్యాస్ కలిస్తే మరింత ప్రమాదకం

ఎల్‌జి పాలిమర్స్ కెమికల్ ప్లాంట్ విశాఖలోని గోపాలపట్నం పరిధిలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో ఉంది. లాక్ డౌన్ కారణంగా చాలా రోజులు ఈ పరిశ్రమని మూసి ఉంశారు. కాగా, ఈ కంపెనీని బుధవారం అర్థరాత్రి తెరిచారు. గురువారం(మే 7,2020) తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో భారీ ప్రమాదం చోటు చేసుకోవడంతో పరిశ్రమ నుంచి స్టైరిన్ మోనోమర్ అనే కెమికల్ వాయువు లీక్ అయ్యింది. దీంతో గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచారు. ఆక్సిజన్ అందక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే చాలామంది అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. స్పృహ తప్పి ఇళ్లలో, రోడ్డు మీద పడిపోయారు. గ్యాస్ ప్రభావంతో చెట్లు మాడిపోయాయి. మూగ జీవాలు మృత్యువాత పడ్డాయి. పరిశ్రమ చుట్టుపక్కల 5 కిలోమీటర్ల పరిధిలో నివాసం ఉంటున్న వారి గ్యాస్ ప్రభావం చూపింది.

ప్రస్తుతం విశాఖలోని గోపాలపట్నంలో మనిషిని ఈ విషయవాయువు ఉక్కిబిక్కిరి చేస్తోంది. గ్యాస్ కలిసిన గాలిని పీల్చిన ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఇప్పటికే ఎనిమిది మంది మృతి చెందగా, దాదాపు 200 తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. 

* ఈ గ్యాస్ ను పీల్చడం వల్ల తలనొప్పి, వినికిడి సమస్య, నీరసం, కళ్లు మంటలు వంటివి ప్రథమంగా కనిపిస్తాయి. 
* ఒకవేళ ఎవరైనా ఈ గ్యాస్ అధిక మోతాదులో పీలిస్తే క్యాన్సర్, కిడ్నీ సమస్యలతోపాటు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. * ప్రమాదానికి గురైన వ్యక్తిని వెంటనే ప్రమాదస్థలి నుంచి వేరే ప్రాంతానికి తీసుకువెళ్లాలి. 
* శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులు తలెత్తితే సదరు వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సను అందించాలి. 
* మిగిలిన గ్యాస్ వాయువులతో పోలిస్తే ఇది చాలా బరువైన వాయువు. 
* ఈ ప్రమాదం జరిగిన చోట 0.5 కిలోమీటర్ల పరిధిలో గాలి చాలా ఘాటుగా ఉంటుంది. 
* అలాగే 3 కిలోమీటర్ల పరిధిలో ప్రజలు కొంతవరకూ అస్వస్థతకు గురి అవుతారు. 
* ఈ గ్యాస్ ప్రభావం ఒకటి, రెండు రోజుల వరకూ ఉంటుంది. 
* స్టైరిన్ గ్యాస్ ను పీల్చడం వల్ల ముక్కు, గొంతు దురదపెట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడడం జరుగుతుంది. 
* అలాగే జీర్ణాశయంపై కూడా దీని ప్రభావం ఉంటుంది. 
* ఒకవేళ గ్యాస్ ను కనుక అధిక మోతాదులో పీలిస్తే ఆరోగ్యపరంగా ఎక్కువగా ఇబ్బంది ఎదురవుతుంది.

Also Read | విశాఖలో లీకైన విషవాయువు..5కి.మీ పరిధిలో వ్యాపిస్తుంది, 48గంటలపాటు ఎఫెక్ట్ చూపిస్తుంది