Visakha Port : మరో అరుదైన రికార్డు సాధించిన విశాఖ పోర్టు

విశాఖ పోర్టు మరో అరుదైన రికార్డు సాధించింది. ఒకే రోజు పోర్టులో అత్యధిక సరుకును హ్యాండిల్ చేసిన ఘనత వహించింది.

Visakha Port : మరో అరుదైన రికార్డు సాధించిన విశాఖ పోర్టు

Visakha Port

Visakha Port : విశాఖ పోర్టు మరో అరుదైన రికార్డు సాధించింది. ఒకే రోజు పోర్టులో అత్యధిక సరుకును హ్యాండిల్ చేసిన ఘనత వహించింది. ఈ నెల 26వ తేదీన రికార్డు స్ధాయిలో కార్గోను హ్యాండ్లింగ్ చేశారు. ఇన్నర్, ఔటర్ హార్బర్, ఎస్ పీ ఎంల నుంచి 3,70,029 మెట్రిక్ టన్నుల సరుకును హ్యాండ్లింగ్ చేసి రికార్డు సృష్టించారు.

New E-cycles from Hero: దేశంలోనే మొట్టమొదటిసారిగా బ్లూటూత్ తో వచ్చిన సైకిల్

గతంలో ఒక్కరోజులో 3,47,722 మెట్రిక్ టన్నుల సరుకును హ్యాండిల్ చేసిన రికార్డును విశాఖ పోర్టు తిరగ రాసింది. పోర్టు ఈ రికార్డును సాధించడం పట్ల ఛైర్మన్ కె.రామ్మోహనరావు హర్షం వ్యక్తం చేశారు. పోర్టు సిబ్బందిని ఛైర్మన్ అభినందించారు.