Visakha Steel Plant : విశాఖ ఉక్కు ఉద్యమం కోసం సాయంత్రం 5.49కి ఆత్మహత్య చేసుకుంటున్నా…

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. ఓ ఉద్యోగి ప్రాణాత్యాగానికి సిద్ధమయ్యాడు. ఆత్మహత్య చేసుకుంటానని శ్రీనివాసరావు అనే స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగి సూసైడ్‌ నోట్‌ రాశాడు.

Visakha Steel Plant : విశాఖ ఉక్కు ఉద్యమం కోసం సాయంత్రం 5.49కి ఆత్మహత్య చేసుకుంటున్నా…

Visakha Steel Plant

employee suicide note : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. ఓ ఉద్యోగి ప్రాణాత్యాగానికి సిద్ధమయ్యాడు. ఉక్కు ఉద్యమం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేస్తున్నానని.. సాయంత్రం 5 గంటల 49 నిమిషాలకు ఆత్మహత్య చేసుకుంటానని శ్రీనివాసరావు అనే స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగి సూసైడ్‌ నోట్‌ రాశాడు. ఈ పోరాటం తన ప్రాణత్యాగం నుంచి మొదలు కావాలని.. కార్మికులంతా కలిసికట్టుగా ఉంటేనే విజయం సాధిస్తామని శ్రీనివాసరావు లెటర్‌లో పేర్కొన్నాడు. శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను వంద శాతం ప్రైవేటీకరిస్తున్నట్టు డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే చేసిన ట్వీట్ ఆంధ్రప్రదేశ్‌లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆరు దశాబ్దాలుగా విశాఖ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన ఉక్కు పరిశ్రమ మనుగడపై… పాండే ట్వీట్‌తో నీలినీడలు కమ్ముకున్నాయి. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం చేసిన ప్రకటనతో విశాఖ భగ్గుమంటోంది. ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉక్కు కార్మికులు, నిర్వాసితులు ఆందోళన చేపడుతున్నారు.

విశాఖ ఉక్కుఫ్యాక్టరీపై ఉన్న యాజమాన్యం హక్కులను వదులుకుని వంద శాతం ప్రయివేటీకరిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. జనవరి 27న జరిగిన కేంద్ర ఆర్ధిక వ్యవహారాల కమిటీ ఇందుకు ఆమోదముద్ర వేసిందని తుహిన్ కాంత పాండే తెలిపారు. ప్రయివేటీ కరణ ద్వారా విశాఖ ఉక్కు యాజమాన్య హక్కులతో పాటు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌లో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న వందశాతం షేర్ హోల్డింగ్‌ను ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

కేంద్రం పూర్తిస్థాయి నిధులతో నిర్మాణమైన ఆ కర్మాగారం…విశాఖ రూపురేఖలను మార్చివేసింది. లక్షలాదిమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించింది. స్టీల్ ప్లాంట్ కేంద్రంగా అభివృద్ధి ప్రారంభమై…రాష్ట్రమంతా విస్తరించింది. ప్రజల జీవన ప్రమాణాలను పెంచింది. స్టీల్‌ ప్లాంట్‌ను, విశాఖను విడదీసి చూడలేం. ఉక్కు ఫ్యాక్టరీతో విశాఖ ఉక్కు నగరంగా మారింది. వైజాగ్ అస్తిత్వానికి ప్రతీకగా ఫ్యాక్టరీ నిలిచింది.