Visakha Global Investors Summit : విశాఖలో మరో మెగా ఈవెంట్.. ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు సర్వం సిద్ధం
ఎన్నో అంతర్జాతీయ ఈవెంట్లకు వేదిక అవుతున్న వైజాగ్ ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక ఈవెంట్ కు స్వాగతం చెబుతోంది. దీంతో మరింత కొత్తగా కనిపించేలా నగరాన్ని ముస్తాబు చేశారు అధికారులు. రేపు, ఎల్లుండి(మార్చి 3,4) రెండు రోజుల పాటు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగనుంది.

Visakha Global Investors Summit : ఎన్నో అంతర్జాతీయ ఈవెంట్లకు వేదిక అవుతున్న వైజాగ్ ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక ఈవెంట్ కు స్వాగతం చెబుతోంది. దీంతో మరింత కొత్తగా కనిపించేలా నగరాన్ని ముస్తాబు చేశారు అధికారులు. రేపు, ఎల్లుండి(మార్చి 3,4) రెండు రోజుల పాటు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగనుంది. ఈ మెగా ఈవెంట్ కు భారీగా పారిశ్రామిక దిగ్గజాలు తరలి వస్తున్నారు.
ఈ సమ్మిట్ కోసం భారీ ఏర్పాట్లు చేసింది ఏపీ ప్రభుత్వం. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో 2లక్షల 30వేల చదరపు అడుగుల విస్తీరణంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగనుంది. ఇందుకోసం వేదిక రెడీ అయ్యింది. ఈ సమ్మిట్ కోసం రూ.100 కోట్లతో విశాఖ నగరాన్ని సుందరీకరించారు. పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను రప్పించడం, ఉపాధి కల్పనే లక్ష్యంగా గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ (జీఐఎస్)కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ప్రభుత్వం. దేశవ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలతో పాటు అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలకు ఆతిథ్యం ఇచ్చేందుకు విశాఖ నగరం సిద్ధమైంది.
ఆరుగురు కేంద్ర మంత్రులు, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు రెండు రోజుల పాటు విశాఖ నుంచే కార్యకలాపాలు కొనసాగించనున్నారు. మార్చి 3న ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన ప్రారంభమయ్యే సమావేశాల్లో కేంద్ర ఉపరితల రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్, పర్యాటక శాఖమంత్రి జి.కిషన్‌రెడ్డి పాల్గొనబోతున్నారు.