Trains Cancelled : రైలు ప్రయాణికులకు గమనిక.. విశాఖ-విజయవాడ మధ్య పలు ట్రైన్స్ రద్దు

దక్షిణ మధ్య రైల్వే పరిధి తుని-గుల్లిపాడు స్టేషన్ల మధ్య ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. దీంతో అధికారులు పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. మరికొన్నింటి గమ్యాలు కుదించారు.

Trains Cancelled : రైలు ప్రయాణికులకు గమనిక.. విశాఖ-విజయవాడ మధ్య పలు ట్రైన్స్ రద్దు

Trains Cancelled

Trians Cancelled : దక్షిణ మధ్య రైల్వే పరిధి తుని-గుల్లిపాడు స్టేషన్ల మధ్య ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. దీంతో అధికారులు పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. మరికొన్నింటి గమ్యాలు కుదించారు.

రద్దు చేసిన రైళ్లు, తేదీలు:
విశాఖపట్నం-విజయవాడ-విశాఖపట్నం(02717-02718).. ఈ నెల 28, 29, జులై 5, 6 తేదీల్లో రద్దు
గుంటూరు-విశాఖపట్నం(07239)..ఈ నెల 27, 28, 29, జులై 4, 5, 6 తేదీల్లో
విశాఖపట్నం-గుంటూరు(07240)…ఈనెల 28, 29, 30, జులై 5, 6, 7 తేదీల్లో
విశాఖపట్నం-లింగంపల్లి(02831)..ఈ నెల 27, 28, 29, జులై 4, 5, 6 తేదీల్లో
లింగంపల్లి-విశాఖపట్నం(02832).., ఈ నెల 28, 29, 30, జులై 5, 6, 7 తేదీల్లో
విశాఖపట్నం-కడప(07488)…జులై 3, 4, 5, 6 తేదీల్లో
కడప-విశాఖపట్నం(07487)…, జులై 4, 5, 6, 7 తేదీల్లో ప్రత్యేక రైళ్లు రద్దు

గమ్యాలు కుదించిన రైళ్లు:
* ఈ నెల 27 నుంచి జులై 18 వరకు పూరి-ఒఖా(08401) ప్రత్యేక రైలు పూరీకి బదులుగా ఖుర్ధారోడ్‌ నుంచి బయలుదేరుతుంది.
* ఈ నెల 23 నుంచి జులై 21 వరకు ఒఖా-పూరీ(08402) ప్రత్యేక రైలు ఖుర్ధారోడ్‌ వరకు నడుస్తుంది.
* ఈ నెల 24 నుంచి జులై 23 వరకు పూరీ-అహ్మదాబాద్‌(02843) ప్రత్యేక రైలు పూరీకి బదులుగా ఖుర్ధారోడ్‌ నుంచి బయలు దేరుతుంది.
* ఈ నెల 24 నుంచి 19 వరకు అహ్మదాబాద్‌-పూరీ(02844) ప్రత్యేక రైలు ఖుర్ధారోడ్‌ వరకు నడుస్తుంది.
* ఈ నెల 25 నుంచి జులై 23 వరకు పూరీ-యశ్వంత్‌పూర్‌(02063), ఈ నెల 27న పూరీ-చెన్నై(02859), ఈ నెల 26 నుంచి జులై 17 వరకు పూరీ-గాంధీదామ్‌(02974), ఈనెల 23 నుంచి జులై 21 వరకు పూరీ-తిరుపతి(07479) ప్రత్యేక రైళ్లు పూరీకి బదులుగా ఖుర్ధారోడ్‌ నుంచి బయలుదేరుతాయి.
* ఈ నెల 26 నుంచి జులై 17 వరకు యశ్వంత్‌పూర్‌-పూరీ(02064), ఈ నెల 28న చెన్నైసెంట్రల్‌-పూరీ(02860), ఈ నెల 23 నుంచి జులై 21 వరకు గాంధీదామ్‌-పూరీ(02973), ఈ నెల 24 నుంచి జులై 23 వరకు తిరుపతి-పూరీ(07480) ప్రత్యేక రైళ్లు పూరీకి బదులుగా ఖుర్ధారోడ్‌ స్టేషన్‌ వరకు నడుస్తాయి. ఆయా రోజుల్లో రైళ్లను ఖుర్ధా.రోడ్‌-పూరీ-ఖుర్ధారోడ్‌ మధ్య రద్దు చేశారు.