Vizag RK Beach : విశాఖ ఆర్కే బీచ్‌లో కలకలం.. రంగు మారిన తీరం, ఆందోళనలో జనం

విశాఖ ఆర్కే బీచ్ లో కలకలం రేగింది. బీచ్ రంగు ఒక్కసారిగా మారింది. తీరం నలుపు రంగులోకి మారిపోయింది. ఎప్పుడూ బంగారంలా మెరిసే ఇసుక తిన్నెలు నల్లగా మారిపోయాయి. తీరం రంగు మారడంతో ఒక్కసారిగా అలజడి రేగింది.

Vizag RK Beach : విశాఖ ఆర్కే బీచ్‌లో కలకలం.. రంగు మారిన తీరం, ఆందోళనలో జనం

Vizag RK Beach : విశాఖ ఆర్కే బీచ్ లో కలకలం రేగింది. బీచ్ రంగు ఒక్కసారిగా మారింది. తీరం నలుపు రంగులోకి మారిపోయింది. ఎప్పుడూ బంగారంలా మెరిసే ఇసుక తిన్నెలు నల్లగా మారిపోయాయి. తీరం రంగు మారడంతో ఒక్కసారిగా అలజడి రేగింది. తీరం రంగు మారడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు అలల మాటున ఏం జరుగుతోంది? సముద్ర గర్భంలో ఎలాంటి అలజడి చెలరేగుతోంది? ఎప్పుడూ లేనిది అలల ఉధృతి ఎందుకు పెరుగుతోంది? ఈ రంగు మారడం దేనికి సంకేతం? ఏదైనా ప్రమాదం పొంచి ఉందా? వైపరిత్యాలకు ఇదేమైనా సంకేతమా?

ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకూ బీచ్ లు నల్లగా మారుతున్నాయి. తీరం రంగు మారడంతో అటుగా వెళ్లేందుకు పర్యాటకులు జంకుతున్నారు. అలలతో ఆటలాడేందుకు భయపడుతున్నారు. గోకుల్ పార్క్ బీచ్, సబ్ మెరైన్ బీచ్, ఉడా పార్కు, పెదజాలరి పేట, జోడుగుళ్లపాలెం, తొట్లకొండ, భీమిలి ప్రాంతాల్లో తరుచూ ఇదే సీన్ కనిపిస్తోంది.

కాగా, తీర ప్రాంతాల్లో ఖనిజాలు ఎక్కువగా ఉంటే ఇసుక నల్లగా మారే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. తీరంలో అగ్నిపర్వతాలు ఉన్నా ఇసుక నల్లబడొచ్చని వివరించారు. వందేళ్ల క్రితం ఎర్రమట్టి భీమిలి దగ్గరకు కొట్టుకొచ్చింది. ఆ తర్వాత క్రమంగా భీమిలి దగ్గర ఎర్రమట్టి దిబ్బలు ఏర్పడ్డాయి. విశాఖ తీరం వెంబడి అనేక ఖనిజాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ప్రతీ ఏడాది జూలై-అక్టోబర్ మధ్య అలల ఉధృతి ఎక్కువగా ఉంటుందన్నారు. ఆ సమయంలో తీరం నల్లగా మారుతుందని వివరించారు. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకూ తీరం నల్లగా మారుతోంది.