MP Vijayasai Reddy : త్వరలోనే విశాఖకు పరిపాలన రాజధాని, ముహూర్తం నిర్ణయించలేదు

ఏపీ ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విశాఖకు రాబోతోందని, ముహూర్తం ఇంకా ఖరారు కాలేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

MP Vijayasai Reddy : త్వరలోనే విశాఖకు పరిపాలన రాజధాని, ముహూర్తం నిర్ణయించలేదు

Mp Vijayasai

AP Executive Capital : ఏపీ ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విశాఖకు రాబోతోందని, ముహూర్తం ఇంకా ఖరారు కాలేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పరిపాలన రాజధాని తరలింపుకు సంబంధించి సంకేతాలు అందుతున్నాయని వెల్లడించారు. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాఖకు రాబోతోందని పదే పదే చెప్పడం జరిగిందని, దీనికన్నా ఎక్కువ విషయాలు ఇప్పుడు చెప్పడం సరికాదన్నారు.

విశాఖ పరిపాలన రాజధానిపై గతంలో కూడా వైసీపీ ఎంపీ విజయసాయి పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. విశాఖలో 44 కిలోమీటర్ల ఆరు లైన్ల రోడ్ల అభివృద్ధి చేయడం, పలు మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది ప్రభుత్వం. కొద్ది రోజుల్లో సీఎం జగన్ ఇక్కడి నుంచే పరిపాలన చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

ఎలాంటి పరిపాలన భవనాలు కావాలనే దానిపై అధికార యంత్రాంగం ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. విలువైన ప్రభుత్వ భూములతో పాటు, ఇతర స్థలాలు, భవనాలు ఇక్కడ ఉన్నాయి. కోర్టులో కొన్ని కేసులు పెండింగ్ లో ఉండడంతో పరిపాలన రాజధానిని తరలిస్తే..న్యాయపరంగా చిక్కులు వస్తాయని ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది. కొద్ది రోజుల్లోనే..వీటికి పరిష్కారం లభిస్తుందని..త్వరలోనే విశాఖకు పరిపాలన రాజధాని తరలనుందని భావిస్తున్నారు.

అమరావతిని శాసన రాజధాని, పరిపాలన రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలును ఏర్పాటు చేస్తూ సీఎం జగన్ ప్రభుత్వం గెజిట్ నోట్ ఇవ్వడంతో వివాదాలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఏపీ అసెంబ్లీ, గవర్నర్ ఆమోదించి చట్టాలుగా మారినా..రాజధాని బిల్లులపై హైకోర్టులో పిటిషన్ లు దాఖలైన సంగతి తెలిసిందే.