Lift Rob : అమ్మాయి కదా అని లిఫ్ట్ ఇచ్చారో.. ఇక అంతే.. అడ్డంగా బుక్కవుతారు

రోడ్డుపై ఒంటరిగా నిలబడుతుంది. అటుగా వచ్చే వాహనదారులను ఆపుతుంది. అర్జంట్ గా వెళ్లాలని లిఫ్ట్ అడుగుతుంది. అయ్యో పాపం.. అసలే అమ్మాయి. పైగా అత్యవసరం అంటోంది అని జాలి చూపారో ఇక అంతే.

Lift Rob : అమ్మాయి కదా అని లిఫ్ట్ ఇచ్చారో.. ఇక అంతే.. అడ్డంగా బుక్కవుతారు

Lift Rob

Lift Rob : రోడ్డుపై ఒంటరిగా నిలబడుతుంది. అటుగా వచ్చే వాహనదారులను ఆపుతుంది. అర్జంట్ గా వెళ్లాలని లిఫ్ట్ అడుగుతుంది. అయ్యో పాపం.. అసలే అమ్మాయి. పైగా అత్యవసరం అంటోంది అని జాలి చూపారో ఇక అంతే. అడ్డంగా బుక్కవడం ఖాయం. బైక్ పై సగం దూరం వెళ్లాక ఆమె తన అసలు రూపం చూపిస్తుంది. డబ్బులు ఇస్తావా.. అఘాయిత్యానికి పాల్పడ్డావని పోలీసులకు ఫిర్యాదు చేయాలా అంటూ బెదిరింపులకు పాల్పడుతుంది. కొంతమంది పరువు పోతుందనే భయంతో ఆమె అడిగిన డబ్బు ఇచ్చేవారు.

అలా వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తుంది. అంతేకాదు చిన్నచిన్న దొంగతనాలకు పాల్పడుతోంది. ఇలా మోసాలకు పాల్పడుతున్న 22ఏళ్ల యువతిని విజయనగరం పోలీసులకు అదుపులోకి తీసుకున్నారు.

గుర్ల మండలానికి చెందిన యువతి వ్యసనాలకు బానిసగా మారింది. ఆమెకు తల్లి లేదు. తండ్రి ఉన్నా పట్టించుకునే వాడు కాదు. దీంతో చిన్నతనంలోనే చదువు మాని కూలి పనుల్లో చేరింది. అక్కడ వచ్చే డబ్బులు సరిపోక తప్పు దారి ఎంచుకుంది. వాహనదారులను బెదిరించడం ప్రారంభించింది. చిన్న చిన్న దొంగతనాలు కూడా స్టార్ట్ చేసింది. అయినా ఎక్కడా కేసులు నమోదు కాలేదు. దీంతో ఆమె దందా సాగించింది.

కాగా, తనను లిఫ్ట్‌ అడిగి బెదిరించి రూ.5 వేలు నగదు, పావు తులం బంగారం తీసుకుందని ఈ నెల 21న విశాఖకు చెందిన యువకుడు టూటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా ఆ యువతిని గుర్తించి కటకటాల్లోకి నెట్టారు.