గో కరోనా.. గో అంటూ నలుగురికి అంటించాడు

  • Published By: Subhan ,Published On : June 26, 2020 / 12:03 PM IST
గో కరోనా.. గో అంటూ నలుగురికి అంటించాడు

కరోనా గో.. కరోనా గో.. గో కరోనా.. గో కరోనా.. అంటూ టిక్ టాక్ చేసిన యువకుడికి కరోనా పాజిటివ్ అని తేలడమే కాకుండా అతనితో పాటు మరో నలుగురికి వైరస్ సోకింది. విజయవాడలో ఉంటున్న వ్యక్తి విజయనగరం రావడంతో వైద్యులు అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అతను హోం క్వారంటైన్ లో ఉండాలని అధికారులు ఆదేశించారు. 

అతనిపై ఎటువంటి పర్యవేక్షణ పెట్టకపోవడంతో రూల్స్ బ్రేక్ చేసి బైక్ పైన గ్రామమంతా తిరుగుతూ చక్కర్లు కొట్టాడు. ఆదేశాలను ధిక్కరించిన ఆ యువకుడు మరికొందరు వ్యక్తులతో కలిసి ఉపాధిహామీ పనులకు వెళ్లాడు. తనకే కాకుండా నలుగురికి కరోనా సోకింది. ఇప్పుడు అతనితో పాటు టిక్ టాక్ చేసిన వ్యక్తులకు కూడా కరోనా సోకి ఉండొచ్చేమోననే ఆందోళనలో పడ్డారు అతని సన్నిహితులు. 

విజయవాడ నుంచి వచ్చిన వారి నుంచే కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారికి 67మందికి కరోనా సోకితే అందులో 45మంది విజయవాడకు చెందిన వారే. వైరస్ సోకుతున్న వారిలో చాలా మంది 20నుంచి 40ఏళ్ల లోపు వారే ఉన్నారని అధికారులు అంటున్నారు. 

వీరి నుంచి వారి కుటుంబ సభ్యుల్లో వయోవృద్ధులు ఉంటే రికవరీ శాతం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే జాగ్రత్తగా వ్యవహరించాలని వయస్సులో ఉన్నామని తమకేం కాదని ఫీలై బయటతిరిగి సమస్యలు పెంచుకోవద్దని జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ అంటున్నారు. 

Read: షోకాజ్ నోటీసులు అందుకుని రెచ్చిపోతున్న రఘురామ; వైసీపీ లీడర్ల సెటైర్లు