AP : కలలో కనిపించి చెప్పిందట..పొలంలో రాజేశ్వరి అమ్మవారి విగ్రహం కోసం తవ్వకాలు

ఆంధ్రప్రదేశ్ లోని పుర్రెయవలసలో ఓ మహిళ రాజేశ్వరి అమ్మవారు తనకు కలలో కనిపిచి.. తన విగ్రహం పొలంలోని భూమిలో ఉందని ఆ విగ్రహాన్ని వెలికి తీసి తనకు గుడి కట్టించాలని చెప్పిందని చెబుతూ.. వ్యవసాయ పొలాల్లో తవ్వకాలు జరిపిస్తోంది. 20 రోజులుగా 30అడుగులకుపైగా నవ్వినా ఎక్కడా ఇప్పటి వరకూ ఎక్కడా చిన్న విగ్రహం కూడా కనిపించలేదు. కానీ తన ఆస్తులు అమ్మి అయినా..అమ్మవారిని దక్కించుకుంటానని..గుడి కట్టిస్తానని అంటోంది కంది లక్ష్మి అనే మహిళ.

AP : కలలో కనిపించి చెప్పిందట..పొలంలో రాజేశ్వరి అమ్మవారి విగ్రహం కోసం తవ్వకాలు

Kandi Lakshmi Rajeswari Ammavaru

Excavations for Rajeshwari Amma Statues : ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లాలోని పుర్రెయవలసలో ఓ మహిళ తన పొలంలో జరుపుతున్న తవ్వకాలను గత 20 రోజులుగా కొనసాగిస్తోంది. రాజేశ్వరి అమ్మవారు తనకు కలలో కనిపిచిందని తన విగ్రహం పొలంలోని భూమిలో ఉందని ఆ విగ్రహాన్ని వెలికి తీసి తనకు గుడి కట్టించాలని చెప్పిందని వ్యవసాయ పొలాల్లో తవ్వకాలు జరిపిస్తోంది. అలా గత 20 రోజుల నుంచి కంది లక్ష్మి అనే మహిళ 15మంది కూలీలను పెట్టి మరీ పొలంలో తవ్వకాలు జరిపిస్తోంది. కానీ ఇప్పటి వరకూ ఎక్కడా చిన్న విగ్రహం కూడా కనిపించలేదు.

దీంతో కూలీలు కూడా విసిగిపోయి తవ్వకాలు అపేస్తాం అని అన్నా కంది లక్ష్మి మాత్రం అమ్మవారి విగ్రహం కోసం తవ్వాల్సిందే..అమ్మవారి నాకు కనిపించేవరకూ తవ్విస్తానను చెబుతోంది. పొలంలో 32 అడుగుల లోతు తవ్వినా ఎక్కడా విగ్రహం కనిపించకపోవటంతో గ్రామస్తులంతా నీదంతా మూఢనమ్మకం..ఇకనైనా తవ్వాకాలు మానేయమని చెబుతున్నారు. అయినా వినకుండా తవ్వకాలను కొనసాగిస్తోందికంది లక్ష్మి. 20రోజులుగా తవ్వకాలు జరుగుతున్నా పోలీసులు గానీ..ఇతర అధికారులు గానీ ఏమాత్రం పట్టించుకోకపోవటం గమనించాల్సిన విషయం.

కాగా చీపురుపల్లి మండలం పుర్రెయవలసలో కంది లక్ష్మి అనే మహిళ నివసిస్తోంది. ఆమెకు రాజేశ్వరి అమ్మవారు కలలో కనిపించి నా విగ్రహాలు పంట పొలంలో ఉణ్నాయని వాటిని వెలికితీసి తనకు గుడి కట్టించమని కోరిందని స్థానికులకు చెప్పింది. ఆ తరువాత తన కొడుకు సహాయంతో పొలంలో కూలీలను పెట్టి తవ్వకాలు ప్రారంభించింది. అలా దాదాపు 20రోజులు గడిచింది. లక్ష్మి కొడుకు కూడా తవ్వకాల కోసం లక్ష్మన్నర రూపాయలు ఖర్చు పెట్టి 30 అడుగుల లోతు తవ్వారు. కానీ ఎక్కడా చిన్నపాటి విగ్రహం కూడా కనిపించలేదు.

కానీ కంది లక్ష్మి మాత్రం తనకు విగ్రహాలు దొరుకుతాయని ఆశాభావం వ్యక్తంచేస్తోంది. అమ్మవారు నాకు కలలో కనిపించి చెప్పటం నా భ్రమ కాదు..గ్రామస్థులు అంటున్నట్లుగా మూఢనమ్మకమూ కాదు నా తల్లీ నాకు కనిపిస్తుంది..నా ఆస్తులు అమ్మి అయినా సరే రాజేశ్వరి అమ్మవారికి గుడి కట్టించి తీరుతాను అనే నమ్మకంతోనే తవ్వకాలను కొనసాగిస్తోంది.