ఎవరితో చెప్పుకోవాలి : అమ్మఒడి డబ్బు కాజేసిన వాలంటీర్

చిత్తూరు జిల్లాలో వాలంటీర్ మోసానికి పాల్పడ్డాడు. అమ్మఒడి సొమ్ము కాజేశాడు. వి.కోట మండలం నడిపేపల్లిలో ఈ ఘటన జరిగింది. అఫ్జల్ అనే వాలంటీర్.. మీరాజ్ అనే మహిళకు

  • Published By: veegamteam ,Published On : January 26, 2020 / 07:36 AM IST
ఎవరితో చెప్పుకోవాలి : అమ్మఒడి డబ్బు కాజేసిన వాలంటీర్

చిత్తూరు జిల్లాలో వాలంటీర్ మోసానికి పాల్పడ్డాడు. అమ్మఒడి సొమ్ము కాజేశాడు. వి.కోట మండలం నడిపేపల్లిలో ఈ ఘటన జరిగింది. అఫ్జల్ అనే వాలంటీర్.. మీరాజ్ అనే మహిళకు

చిత్తూరు జిల్లాలో వాలంటీర్ మోసానికి పాల్పడ్డాడు. అమ్మఒడి సొమ్ము కాజేశాడు. వి.కోట మండలం నడిపేపల్లిలో ఈ ఘటన జరిగింది. అఫ్జల్ అనే వాలంటీర్.. మీరాజ్ అనే మహిళకు మాయమాటలు చెప్పి ఏటీఎం కార్డు తీసుకున్నాడు. దాంతో రూ.15వేలు డ్రా చేశాడు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న మహిళ తాను మోసపోయాయని గుర్తించింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్దిదారులకు అందేలా చూసేందుకు సీఎం జగన్ వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు. సంక్షేమ పథకాలు డోర్ డెలివరీ చేయడం వాలంటీర్ల బాధ్యత. అర్హులను గుర్తించి వారికి పథకాలు అందేలా చూడాలి. కానీ కొందరు వాలంటీర్లు డబ్బు కక్కుర్తితో అడ్డదారులు తొక్కుతున్నారు. అమాయకులను మోసం చేస్తున్నారు. నిరక్ష్యరాసులను దోచుకుంటున్నారు. మాయ మాటల చెప్పి లబ్దిదారులకు అందాల్సిన డబ్బుని కొట్టేస్తున్నారు.