మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు : సుప్రీం మెట్లెక్కిన ఆర్కే

  • Published By: madhu ,Published On : November 25, 2019 / 10:21 AM IST
మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు : సుప్రీం మెట్లెక్కిన ఆర్కే

గత కొన్ని సంవత్సరాలుగా స్తబ్దుగా ఉన్న ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. సుప్రీంకోర్టులో ఎర్లీ హియరింగ్ పిటిషన్‌ను వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే దాఖలు చేశారు. 2017లో పిటిషన్ దాఖలు చేసినా సుప్రీంకోర్టులో లిస్టింగ్ కాకపోవడంతో మరోసారి సుప్రీంను ఆశ్రయించారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసు సంచలనం సృష్టించింది. 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఎంతోమందికి నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసులో ఈడీ విచారణ జరుపుతోంది. ముద్దాయిలపై ఇప్పటికే ఏసీబీ అధికారులు ఛార్జీ షీట్లు దాఖలు చేశారు. ఈ కేసులో బాబు వాయిస్‌తో ఉన్న ఓ ఫోన్ కాల్ తీవ్ర సంచలనం సృష్టించింది. ఏసీబీ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై బాబు సవాల్ చేసిన సంగతి తెలిసిందే. 

> నామినేటెడ్ ఎమ్మెల్యే స్టిఫెన్ సన్ కు 50 లక్షల రూపాయలు ఇస్తూ అప్పటి టీడీపీ నేత రేవంత్ రెడ్డి పట్టుబడ్డారు. 
> స్టీఫెన్ సన్‌ను రేవంత్ రెడ్డి కలిసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
> కొన్నాళ్ల పాటు రేవంత్ జైలు శిక్షను అనుభవించారు. బెయిల్ మీద బయటకు వచ్చారు. 
> ఓటుకు నోటు కేసులో బాబు పాత్రపై విచారణ జరిపించాలని ఏసీబీ కోర్టు ఆదేశించినా..హైకోర్టు స్టే విధించింది. 
> న్యాయస్థానంలో దాఖలు చేసిన అఫిడవిట్‌లో బాబు పేరును ప్రస్తావించింది. 
> రేవంత్ రెడ్డి ఇంటితో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న ఉదయ్ సింహా, సెబాష్టియన్  ఇళ్ళలో కూడా సోదాలు నిర్వహించి అనేక కీలక ఆధారాలు సేకరించారు.
> తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కేసు పురోగతి సమీక్షించడం సంచలనం సృష్టించింది. 
> ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పటి వరకు పలు అంశాలపై పిటిషన్లు దాఖలు చేశారు. 
Read More : ఆర్టీసీ జీతభత్యాలపై హైకోర్టులో విచారణ