సీఎంల పనితీరుపై ర్యాంకులు : కేసీఆర్ ఫస్ట్.. చంద్రబాబు 14

  • Published By: venkaiahnaidu ,Published On : March 22, 2019 / 12:30 PM IST
సీఎంల పనితీరుపై ర్యాంకులు : కేసీఆర్ ఫస్ట్.. చంద్రబాబు 14

దేశంలోని సీఎంల పనితీరుకి సంబంధించి ర్యాంకులు విడుదల అయ్యాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ నెంబర్ వన్ (ఫస్ట్) స్థానం దక్కించుకున్నారు. సీవోటర్-ఐఏఎన్ఎస్ సంస్థ నేషన్ ట్రాకర్ ఒపీనియన్ పోల్ నిర్వహించింది. ఇందులో ఓటర్ల నుంచి అధికశాతం అఫ్రూవల్ రేటింగ్స్ అందుకున్న సీఎంగా కేసీఆర్ నిలిచారు.కేసీఆర్ తో పాటు హిమాచల్ ప్రదేశ్, ఒడిషా, ఢిల్లీ రాష్ట్రాల సీఎంలు కూడా టాప్ ప్లేస్ లో నిలిచారు. ఈ రాష్ట్రాల సీఎంల పనితీరుపై ఓటర్లు అత్యంత సంతోషంగా ఉన్నట్లు తేలింది.
Read Also : రౌడీ రాజకీయాలపై పవన్ ఫైర్ : తాట తీస్తానంటూ హెచ్చరిక

ఈ సర్వే ప్రకారం..దేశంలోని అందరి సీఎంల కన్నా తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనపై అధికశాతం ప్రజలు సంతోషంగా ఉన్నట్లు తేలింది. తెలంగాణలో 2వేల 827మంది తమ అభిప్రాయాలను చెప్పగా అందులో 68.3శాతం మంది కేసీఆర్ పాలనపై సంతృప్తి వ్యక్తం చేశారు. కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు దేశంలో ఏ నాయకుడు చేపట్టలేదని తెలిపారు. 20.8శాతం మంది కేసీఆర్ పాలన పర్వాలేదని చెప్పారు. 9.9శాతం మంది కేసీఆర్ పాలనపై పూర్తిగా అసంతృప్తితో ఉన్నట్లు తమ అభిప్రాయం వెల్లడించారు.

మొత్తంగా 79.2శాతం నెట్ అఫ్రూవల్ రేట్ తో దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎంగా కేసీఆర్ నిలిచారు. కేసీఆర్ తర్వాత స్థానంలో 68.4శాతంతో హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ నిలిచారు. 64.9శాతంతో ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ నిలవగా, 61.5శాతం నెట్ అఫ్రూవల్ రేట్ తో ప్రజాదరణ ఉన్న సీఎంల జాబితాలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నాలుగో స్థానంలో నిలిచారు. 
Read Also : ఏపీ ఎన్నికలు : పోటీలోని కోటీశ్వరులు వీరే

ఈ సర్వే ప్రకారం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు 14వ స్థానానికి పరిమితం అయ్యారు. ఏపీలో 19వేల 900మంది అభిప్రాయాలు తెలుసుకోగా.. చంద్రబాబు పనితీరుపై కేవలం 41.7శాతం మంది ప్రజలు సంతృప్తితో ఉన్నారు. 28.2శాతం మంది ప్రజలు పర్వాలేదని చెప్పారు. 28.6శాతం మంది బాబు పాలనపై సంపూర్ణ అసంతృప్తి వ్యక్తం చేశారు.

అయితే ఈ సర్వే బీజేపీకి నిరాశ కలిగించేలా ఉంది. కేవలం రెండు రాష్ట్రాల బీజేపీ సీఎంలు మాత్రమే టాప్ 10లో చోటు దక్కించుకున్నారు. హిమాచల్ ప్రదేశ్, అస్సాం సీఎంలు సర్బానంద, సోనోవాల్ మాత్రమే టాప్ 10లో నిలిచారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ 11వస్థానాన్ని దక్కించుకుంది. ఇక తమిళనాడు, పుదుచ్చేరి, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖాండ్ రాష్ట్రాల సీఎంల పనితీరుపై ఆయా రాష్ట్రాల్లోని అధికశాతం ప్రజలు అసంతృప్తిగా ఉన్నట్లు తేలింది. తమిళనాడులో అన్నాడీఎంకే-బీజేపీ పొత్తుపై కూడా అక్కడి ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సర్వే తెలిపింది. 

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాలనపై అసంతృప్తిగా ఉన్నట్లు అధికశాతం ప్రజలు తెలిపారు. 22.2శాతం నెట్ అఫ్రూవల్ రేట్ తో 21వస్థానంలో యోగి నిలిచారు. తమిళనాడు ఈ జాబితాలో చివరి స్థానంలో నిలిచింది. పళనిస్వామి పాలనపై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నట్లు స్పష్టంగా తేల్చేశారు.
Read Also : సీటు గోవిందా..! : సిట్టింగ్‌లకు నో ఛాన్స్