AP Govrnament: ప్లాట్ కావాలా.. డబ్బులు కావాలా? తేల్చుకోండి..

ఏపీలోని గత ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి పరిధిలోని నేలపాడు సమీపంలో ‘హ్యాపీ నెస్ట్‌’ పేరుతో సీఆర్డీఏ ఆధ్వర్యంలో అపార్ట్‌మెంట్లు నిర్మించేందుకు నిర్ణయించింది. 15ఎకరాల్లో 12టవర్లను నిర్మించి అందులో 1200 అపార్ట్‌మెంట్లను అందుబాటులోకి తెచ్చేందుకు అప్పట్లో చర్యలు చేపట్టారు.

AP Govrnament: ప్లాట్ కావాలా.. డబ్బులు కావాలా? తేల్చుకోండి..

Happy Nest

AP Govrnament: ఏపీలోని గత ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి పరిధిలోని నేలపాడు సమీపంలో ‘హ్యాపీ నెస్ట్‌’ పేరుతో సీఆర్డీఏ ఆధ్వర్యంలో అపార్ట్‌మెంట్లు నిర్మించేందుకు నిర్ణయించింది. 15ఎకరాల్లో 12టవర్లను నిర్మించి అందులో 1200 అపార్ట్‌మెంట్లను అందుబాటులోకి తెచ్చేందుకు అప్పట్లో చర్యలు చేపట్టారు. రెండు దశల్లో 12టవర్లతో 1200 ప్లాట్లు చొప్పున నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్లాట్లకు ముందస్తు బుకింగ్ కోసం అప్పట్లో పోటీపడ్డారు.

Hyderabad Metro: సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8గంటల వరకు ఆ మూడు స్టేషన్లలో మెట్రో సేవలు బంద్

ప్లాట్లను కొనేందుకు దేశ విదేశాల నుంచి కొనుగోలుదారులు బుకింగ్స్ చేసుకున్నారు. అయితే 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం మారిన తరువాత ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. మూడుసార్లు టెండర్లు పిలిచిన నిర్మాణానికి గుత్తేదారులు ఎవరూ ముందుకు రాలేదు. హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్టులో 1187 మంది ప్లాట్లను బుకింగ్ చేసుకున్నారు. తొలి వాయిదాసైతం చెల్లించారు. గత రెండేళ్ల క్రితం కొవిడ్ వ్యాప్తి కారణంగా రేరా ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఏడాది సమయం పొడిగించింది.

Hyderabad Metro: సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8గంటల వరకు ఆ మూడు స్టేషన్లలో మెట్రో సేవలు బంద్

ప్రాజెక్ట్ ఆలస్యం కారణంగా ఇప్పటికే ఐదుగురు రద్దు చేసుకున్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణం పూర్తిగా నిలిచిపోవటంతో పాటు విశాఖపట్టణంను రాజధానిగా వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో హ్యాపీ నెక్ట్స్ ప్రాజెక్టులో డబ్బులు చెల్లించిన వారు ఆందోళన వ్యక్తం చేశారు. హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్టులో ప్లాట్ల కోసం డబ్బులు చెల్లించిన కొనుగోలుదారులకు తాజాగా సీఆర్డీఏ లేఖలు రాసింది. ప్లాట్ కావాలా, డబ్బులు కావాలా తేల్చుకోవాలని లేఖలో సీఆర్డీఏ పేర్కొంది.