పోలీసులపై టీడీపీ విమర్శలు: SP, నారా లోకేష్ మధ్య ట్విట్టర్‌ వార్!

  • Published By: vamsi ,Published On : November 26, 2020 / 10:07 AM IST
పోలీసులపై టీడీపీ విమర్శలు: SP, నారా లోకేష్ మధ్య ట్విట్టర్‌ వార్!

టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్‌కు, Guntur Urban SP అమ్మి రెడ్డికి మధ్య ట్విట్టర్‌లో వార్ నడిచింది. ఓ టీడీపీ కార్యకర్త విషయంలో స్పందించిన నారాలోకేష్.. పోలీసులు వైసీపీ నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేయగా.. దానికి ఎస్‌పీ కౌంటర్ ట్వీట్ చేశారు. దీంతో ట్విట్టర్‌లో వార్ నడిచింది. ఈ క్రమంలో టీడీపీ నాయకులు పోలీసుల చర్యలను తప్పుబడుతూ ట్విట్టర్‌లో కామెంట్లు చేస్తున్నారు.



https://10tv.in/pm-narendra-modi-speech-at-lucknow-university/
“పులివెందుల పిల్లి టిడిపి కార్యకర్తలను చూసి భయపడుతుంది. సగం గోడ కట్టి ఎమ్మెల్యే భారీ ప్రారంభోత్సవం చెయ్యడమే సిగ్గుచేటు. గోడ గ్రాండ్ ఓపెనింగ్‌ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసినందుకు పొన్నూరులో టిడిపి కార్యకర్త మణిరత్నాన్ని పోలీసులు అక్రమ అరెస్టు చెయ్యడం వైఎస్ జగన్ పిరికితనాన్ని బయటపెట్టింది. మణిరత్నం పెట్టిన పోస్ట్‌లో తప్పేంటో అరెస్ట్ చేసిన పోలీసులు చెప్పాలి. వైకాపా నాయకులు ఆడమన్నట్టు ఆడుతున్న కొంతమంది పోలీసులు ఇలాంటి అక్రమ అరెస్టులతో సాధించేది ఏమి ఉండదు ప్రతిగా కష్టాలు కొనితెచ్చుకోవడం తప్ప” అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.


అయితే నారా లోకేష్ చేసిన ట్విట్టర్ ట్వీట్లపై స్పందిస్తూ.. గుంటూరు అర్బన్ ఎస్పీ ఆర్ ఎన్ అమ్మి రెడ్డి కౌంటర్ ట్వీట్ చేశారు. తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తే లోకేశ్‌పై చర్యలు తీసుకుంటాం అంటూ హెచ్చరించారు. నారాలోకేష్ చేస్తున్న వ్యాఖ్యలు కుల కలహాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, పోలీసుల చర్యలు ఎస్‌సీ వర్గానికి వ్యతిరేకంగా ఉందని చిత్రీకరిస్తున్నారని చెప్పుకొచ్చారు. అసత్య వార్తలు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలకు బాధ్యత వహించాల్సి వస్తుంది అని ఆయన ట్వీట్ చేశారు.


ఈ క్రమంలోనే ఎస్పీ అమ్మి రెడ్డి ట్వీట్‌కు కౌంటర్‌గా నారా లోకేష్ మరో ట్వీట్ చేశారు. మీకు నిజంగా ధైర్యం ఉంటే, పెద్దకాకాని పోలీస్‌స్టేషన్‌లో సీసీ ఫుటేజ్‌ని విడుదల చేయండి. పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన మణి ఫోటోను అటాచ్ చేస్తున్నాను. మీరు మీ పొలిటికల్ బాస్‌ల కోసం వంగిపోవడాన్ని ఆపాలంటూ ఎస్పీ ట్వీట్‌కు లోకేష్ కౌంటర్ ట్వీట్ చేశారు.