Hot Summer : మూడు రోజులు జాగ్రత్త.. ఇంట్లో నుంచి బయటకు రావొద్దు.. ఏపీ ప్రజలకు హెచ్చరిక

అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఒక్కసారిగా పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరిగాయి. రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. అసలే మాడు పగిలే ఎండలతో జనాలకు చెమట్లు పడుతుంటే, వడగాలులు తోడయ్యాయి.

Hot Summer : మూడు రోజులు జాగ్రత్త.. ఇంట్లో నుంచి బయటకు రావొద్దు.. ఏపీ ప్రజలకు హెచ్చరిక

Warning For Ap People Be Careful1

Warning For AP People : అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఒక్కసారిగా పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరిగాయి. రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. అసలే మాడు పగిలే ఎండలతో జనాలకు చెమట్లు పడుతుంటే, వడగాలులు తోడయ్యాయి. తీవ్రమైన ఎండలు, వడగాలులు భయపెడుతున్నాయి. సాధారణం కన్నా 3 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

ఏపీలో రానున్న రోజుల్లో వీటి తీవ్రత మరింత అధికంగా ఉండనుంది. దీంతో వాతావరణ కేంద్రం అధికారులు ప్రజలను అలర్ట్ చేశారు. మూడు రోజులు(నేడు-ఏప్రిల్ 3,2021)..రేపు(ఏప్రిల్ 4,2021).. ఎల్లుండి(ఏప్రిల్ 5,2021) ఎండలు, వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు.

ఇవాళ, రేపు, ఎల్లుండి ఆంధ్రప్రదేశ్‌ లో వాతావరణ మార్పులకు సంబంధించి అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ నివేదిక ఇచ్చారు. ఆ వివరాల ప్రకారం రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ విధంగా ఉన్నాయి.

ఉత్తర కోస్తాంధ్ర:
ఈ రోజు(ఏప్రిల్ 3,2021) ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు(ఏప్రిల్ 4,2021), ఎల్లుండి(ఏప్రిల్ 5,2021) ఉత్తర కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులు, 40-50 కిమీ వేగంతో ఈదురు గాలులుతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తాంధ్ర :
ఈ రోజు, రేపు, దక్షిణ కోస్తాంధ్రలో ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వడగాలులు, అక్కడక్కడ తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉంది. ఇక, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో వడగాలులు వీచే చాన్స్ ఉంది. ఎల్లుండి దక్షిణ కోస్తాంధ్రలో ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. అటు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది.

రాయలసీమ:
ఈ రోజు, రేపు రాయలసీమలో ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లాలో వడగాలులు అక్కడక్కడ వీచే అవకాశం ఉంది. ఎల్లుండి రాయలసీమలో ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది.

ఎండలు, వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసరం అయితే తప్ప ఎండలో తిరగకపోవడమే మంచిదన్నారు. ఎండలో తిరగాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నేరుగా ఎండవేడి తగలకుండా గొడుగు వాడాలన్నారు. క్యాప్ ధరించాలన్నారు. నిత్యం వాటర్ బాటిల్ వెంట ఉంచుకోవాలన్నారు. డీహైడ్రేషన్ కు గురి కాకుండా చూసుకోవాలన్నారు. దాహం తీర్చుకోవడానికి కూల్ డ్రింక్స్ బదులుగా కొబ్బరి బొండం నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ తాగాలని సూచించారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచించారు.