Telugu States Water dispute : సుప్రీంకోర్టుకు చేరిన జలవివాదం..ఏపీ ప్రభుత్వం పిటిషన్

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. గత కొన్ని రోజులుగా నీటి వాడకం విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా..ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది.

Telugu States Water dispute : సుప్రీంకోర్టుకు చేరిన జలవివాదం..ఏపీ ప్రభుత్వం పిటిషన్

Krishna Water

Water dispute : తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. గత కొన్ని రోజులుగా నీటి వాడకం విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా..ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. తెలంగాణ రాష్ట్ర వైఖరికి వ్యతిరేకంగా సుప్రీంలో ఏపీ పిటిషన్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నది జలాలు, నీటి పారుదల ప్రాజెక్టుపై ఏపీ పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.

Read More : Zomato IPO: జొమాటోలో 35రెట్లు ఎక్కువ పెట్టుబడులకు రెడీగా యాంకర్ ఇన్వెస్టర్లు

నాగార్జున సాగర్, శ్రీశైలం, కేఆర్ఎంబీ పరిధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని, విభజన చట్టం ప్రకారం నడుచుకోవడం లేదని పిటిషన్ లో పేర్కొంది. పర్యావరణ అనుమతులు లేకుండానే ప్రాజెక్టుల నిర్మాణాలు చేస్తోందని వెల్లడించింది. ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకుని..తగిన ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంను కోరింది. నీటిని అధికంగా వాడుతున్నారని, విద్యుత్ ఉత్పత్తి కూడా చేస్తోందని ఏపీ ప్రభుత్వం ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. నీటి ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం…తెలంగాణ ప్రభుత్వం నడుచుకొనే విధంగా చూడాలని వెల్లడించింది.

Read More : Dwarka : ద్వారకలో శ్రీకృష్టుడి దేవాలయానికి పిడుగుపాటు.. చిరిగిన దేవాలయం జెండా..

కేంద్రం జోక్యం చేసుకుని..ఎలాంటి చొరవ తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. గతంలో కోర్టు విచారణ రాకముందే..కేంద్రం పలు సూచనలు చేయడంతో పిటిషన్ ను ఉపసంహరించుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని చర్చించుకుంటే సమస్య పరిష్కారమౌతోందని ప్రతిపక్షాలు సూచిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతామని టీఆర్ఎస్ వెల్లడిస్తోంది. దీంతో ఇరు రాష్ట్రాల నేతలు విమర్శలు గుప్పించుకుంటున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామని వెల్లడిస్తోంది. నీటి జలాల వివాదం విషయంలో కేంద్ర వైఖరిని కోర్టు ప్రశ్నించే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై కేంద్రం ఎలాంటి స్పందన వ్యక్తం చేస్తుందో చూడాలి.