నామినేషన్లు వేసేవారిని అడ్డుకుంటే కఠిన చర్యలు : ఈసీ రమేష్ కుమార్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధమైనట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తెలిపారు. అన్ని జిల్లాల్లో అధికారులను మోహరించామని తెలిపారు.

  • Published By: veegamteam ,Published On : March 11, 2020 / 07:39 AM IST
నామినేషన్లు వేసేవారిని అడ్డుకుంటే కఠిన చర్యలు : ఈసీ రమేష్ కుమార్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధమైనట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తెలిపారు. అన్ని జిల్లాల్లో అధికారులను మోహరించామని తెలిపారు.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధమైనట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తెలిపారు. అన్ని జిల్లాల్లో అధికారులను మోహరించామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై బుధవారం (మార్చి 11, 2020) ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. నామినేన్లు వేసే వారిని అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

రాష్ట్రంలో సమర్థవంతమైన యంత్రాంగం ఉందన్నారు. నామినేషన్ దాఖలు చేసే వారిని అడ్డుకుంటే చర్యలు తీసుకుంటామని చెప్పారు. చిత్తూరు ఘటనపై కేసు నమోదు చేశామని చెప్పారు. అన్ని జిల్లాల్లో అధికార యంత్రాంగాన్ని మోహరించామని తెలిపారు.

మోడల్ కోడ్ ఆఫ్ కండక్టు అంటే ప్రభుత్వాన్ని మొత్తం కట్టడి చేయడం, పని చేయకుండా ఉండటం కాదన్నారు. ప్రభుత్వానికి అనేక బాధ్యతులుంటాయన్నారు. ప్రభుత్వ బాధ్యతల్లో భాగంగా నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. మామూలుగా ప్రజాహితం కోసం చేేసే కార్యక్రమాలకు ఎటువంటి ఆటకం లేదన్నారు.

ఓటర్లను ప్రలోభాలు, వాటికి గురిచేసే కార్యక్రమాలకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందన్నారు. ప్రభుత్వం తన మామూలు, దైనందిన కార్యక్రమాలు, వెల్ఫేర్ కార్యక్రమాలు ఎప్పుడైనా చేసుకుంటాయని చెప్పారు. నిఘా యంత్రాంగం ఉడటం మంచిదే అన్నారు. దాన్ని దుర్వినియోగం చేయకుండా, టార్గెట్ చేయకుండా ఉండటం మంచిందని భావిస్తున్నానని తెలిపారు. ఎన్నికల్లో వాలంటీర్ల వినియోగం అవసరం లేదన్నారు. 

See Also | విశాఖ మేయర్ పీఠం వైసీపీదే…. పక్కాగా పావులు కదుపుతున్న విజయసాయి రెడ్డి