West Godavari : కరోనా కట్టడిలో ఆ జిల్లా బెస్ట్..కేసులను ఎలా తగ్గించారో తెలుసా?

ఏపీలో భారీగా కరోనా కేసులు నమోదు అవుతున్నా.. పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం అత్యల్ప కేసులు వస్తున్నాయి. జిల్లాలో కరోనా కేసులు తగ్గడానికి కారణం ఏమిటీ... ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

West Godavari : కరోనా కట్టడిలో ఆ జిల్లా బెస్ట్..కేసులను ఎలా తగ్గించారో తెలుసా?

West Godavari District Best In Controlling Corona

West Godavari district best in controlling corona : కరోనా పేరు చెప్తే చాలు… ఇప్పుడు అంతా హడలిపోతున్నారు. పైకి ధైర్యంగా ఉన్నటున్నా… రోజురోజుకు కేసులు పెరుగుతుండటంతో ప్రజలతో పాటు అధికారుల్లోనూ భయం మొదలైంది. రాష్ట్రంలో భారీగా కేసులు నమోదు అవుతున్నా పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం అత్యల్ప కేసులు వస్తున్నాయి. జిల్లాలో కరోనా కేసులు తగ్గడానికి కారణం ఏమిటీ… ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

గతేడాది రికార్డు స్థాయిలో కేసులు… కానీ ఈసారి మాత్రం రాష్ట్రంలోనే అత్యల్పం… పశ్చిమ గోదావరి జిల్లా వాసులకు కొంత ఊరట కలిగించే అంశమిందే. కరోనా కేసులు అత్యల్పంగా నమోదవుతున్నాయి. సెకండ్‌ వేవ్‌లో నిత్యం వేల సంఖ్యలో కేసులు బయటపడుతున్నా… పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం కరోనా కట్టడిలోనే ఉంది. రాష్ట్రంలో 12 జిల్లాలు ఒక ఎత్తు… పశ్చిమ గోదావరి జిల్లా మాత్రం ఒక ఎత్తు అన్నట్లుగా ఉంది. జిల్లాలో ఇప్పటి వరకు కేవలం 538 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి.

గతేడాదితో పోలిస్తే ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా లాస్ట్‌ ప్లేస్‌లో ఉంది. జిల్లాలో కరోనా ప్రభావం కట్టడి చేసేందుకు అధికారులు పక్కా ప్లాన్‌ అమలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించే విషయంలో పోలీసులు కఠినగంగా వ్యవహరిస్తున్నారు. అలాగే అవగాహన ర్యాలీలతో ప్రజల్లో కరోనాపై భయం ఏర్పడింది. జాగ్రత్తలు తప్పనిసరిగా పాటిస్తున్నారు. మాస్క్‌ లేకపోతే ఫైన్‌ వేస్తున్నారు. ప్రయాణ సమయంలో మాస్క్‌ లేని వారిని కిందకి దింపేస్తున్నారు.

అటు కేసులు నమోదైన ప్రాంతాల్లో ఆరోగ్య శాఖ అధికారులు తక్షణమే శానిటేషన్‌ ప్రక్రియ చేస్తున్నారు. వైరస్‌ విస్తరించకుండా… ఎక్కువ శాతం హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంచి వైద్యం అందిస్తుండటం కూడా కేసుల సంఖ్య తక్కువ నమోదుకు ప్రధాన కారణం. ఇప్పటికే కరోనా ట్రీట్‌మెంట్ కోసం ప్రత్యేక బెడ్లు సిద్ధం చేశారు. ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారానే కరోనాను తగించగలిగినట్లు జిల్లా వైద్యాధికారులు చెబుతున్నారు.

అటు కరోనా కట్టడికి జిల్లా ఛాంబర్‌ ఆఫ్ కామర్స్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 21 నుంచి సాయంత్రం 6 గంటల వరకే షాపులు తెరిచి ఉంచుతామని ప్రకటించింది. దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఈ కారణాలే కరోనా సెకండ్ వేవ్ లో పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యల్పంగా నమోదు అవ్వడానికి కారణంగా తెలుస్తుంది.