ఇన్ సైడర్ ట్రేడిండ్ అంటే ఏంటీ? ఎలా చేస్తారు

  • Published By: venkaiahnaidu ,Published On : December 28, 2019 / 10:50 AM IST
ఇన్ సైడర్ ట్రేడిండ్ అంటే ఏంటీ? ఎలా చేస్తారు

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు బాగా వినిపిస్తున్న మాట ఇన్ సైడర్ ట్రేడింగ్. వాస్తవానికి ఇది స్టాక్ మార్కెట్ కు సంబంధించిన లావాదేవీల్లో జరిగే వ్యవహారం. అయితే ఇప్పుడు ప్రస్తుత ఏపీ రాజధాని అమరాతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని అధికార పార్టీ నాయకులు,మంత్రులు నిత్యం ఆరోపణలు చేస్తూ ఉన్నారు. టీడీపీ హయాంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని,వేల ఎకరాల భూములు కొందరు వ్యక్తులు చేతుల్లో ఉన్నాయని అధికార వైసీపీ ఆరోపిస్తోంది. దీనిపై ఓ కేబినెట్ సబ్ కమిటీని కూడా ప్రభుత్వం నియమించడం, ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడినవారి వివరాల జాబితాను ఆ కమిటీ ప్రభుత్వానికి అందించడం జరిగింది.

అసలు ఏంటీ ఇన్ సైడర్ ట్రేడింగ్?
ప్రభుత్వంలో ఉండే పెద్దలు అంటే ముఖ్యమంత్రి..మంత్రులు ప్రమాణస్వీకార సమయంలో ప్రభుత్వానికి సంబంధించిన సీక్రెట్ ను బయటపెట్టను, వ్యక్తిగత స్వార్థం కోసం ఏ పనీ చేయం అని చెబుతుంటారు. వాస్తవంగా అయితే ప్రభుత్వం ఓ పాలసీని రూపొందిస్తుంది,కేబినెట్ మీటింగ్ లో ఆ పాలసీని ఆమోదం జరుగుతుంది. ఇన్ సైడర్ ట్రేడింగ్ అప్పుడు ఏం జరుగుతేందంటే..పాలసీ ముందుగా డిసైడ్ అయిపోతుంది. కొద్దిమందికి,కొన్ని సంస్థలకు మాత్రమే దీని గురించి తెలుస్తోంది. ఆ తర్వాత ఫలానా చోట ఫలానా ప్రాజెక్టు వస్తుందంటూ మంత్రుల నుంచి,ఆ పాలసీ గురించి ముందుగా తెలిసిన వాళ్లు లీకులు ఇస్తుంటారు. అయితే ఈ లీకులను నమ్మి చాలామంది ఆ ప్రాంతాల్లో పెట్టుబడి పెబుతుంటారు. అయితే ముందుగా ప్రాజెక్టు ఖచ్చితంగా వచ్చే చోటు గురించి తెలిసిన వాళ్లు మాత్రం అందరికంటే ముందు ప్రాజెక్టు వచ్చే ప్రాంతంలో స్థలాల కొనుగోలు,పెట్టుబడులు పెట్టడం వంటివి చేస్తుంటారు. అంటే మిగిలిన వాళ్లను తప్పుదోవ పట్టించి వాళ్లు లాభపడతారు. దీనినే ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటారు.

చట్టబద్ధమైన ఇన్ సైడర్ ట్రేడింగ్

సంస్థ యొక్క వాటాలను మరియు వాటిని నియమించే ఏదైనా అనుబంధ సంస్థలను కొనుగోలు చేయడానికి మరియు విక్రయించడానికి ఇన్ సైడర్లకు చట్టబద్ధంగా అనుమతి ఉంది. ఏదేమైనా, ఈ లావాదేవీలు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్‌ఇసి) లో సరిగా నమోదు చేయబడాలి. అంతేకాకుండా ముందస్తు దాఖలుతో చేయాలి.

ఒక CEO తన సంస్థ యొక్క వాటాలను తిరిగి కొనుగోలు చేసినప్పుడు లేదా ఇతర ఉద్యోగులు వారు పనిచేసే సంస్థలో స్టాక్ కొనుగోలు చేసినప్పుడు లీగల్ ఇన్ సైడర్ ట్రేడింగ్ తరచుగా జరుగుతుంది. తరచుగా, ఒక CEO కొనుగోలు వాటాలు వారు కలిగి ఉన్న స్టాక్ ధరల కదలికను ప్రభావితం చేస్తాయి. దీనికి ఓ మంచి ఉదాహరణ…వారెన్ బఫ్ఫెట్ బెర్క్‌షైర్ హాత్వే గొడుగు కింద ఉన్న కంపెనీలలో వాటాలను కొనుగోలు చేయడం లేదా విక్రయించడం.

చట్టవిరుద్ధమైన ఇన్ సైడర్ ట్రేడింగ్
అక్రమ లాభం కోసం కొద్దిమందికే తెలిసిన,ఎవరికీ తెలియని సమాచారాన్ని చట్టవిరుద్ధంగా ఉపయోగించడం. సమాచారం బహిరంగంగా తెలియనింతవరకు ఈ కొద్దిమంది మిగిలిన వాళ్లను తప్పుదవోవ పట్టించి వాళ్లు లాభం పొందుతుంటారు. ఉదాహరణకు… బహిరంగంగా వర్తకం చేసే సంస్థ యొక్క CEO హెయిర్ కట్ చేయించుకునేటప్పుడు తమ సంస్థ యొక్క త్రైమాసిక ఆదాయ వివరాలను వెల్లడిస్తారని అనుకుందాం. హెయిర్ కటింగ్ చేసే వ్యక్తి ఈ సమాచారాన్నితీసుకొని దానిపై వర్తకం చేస్తే, అది అక్రమ అంతర్గత వర్తకంగా పరిగణించబడుతుంది. దీనిపై SEC చర్య తీసుకోవచ్చు.