Godavari Floods : గోదావరి వరద ముంచెత్తినా తప్పిన ప్రాణ నష్టం.. ప్రజలను కాపాడిన ఆ అదృశ్య శక్తి ఏంటి?

వరద విరుచుకుపడినా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇళ్లలోకి నీళ్లు చేరి ఇబ్బందులు పడుతున్న జనాలే ఉన్నారే తప్ప ప్రాణ నష్టం అన్న పదం ఎక్కడా వినపడలేదు. అసలీ ప్రమాదం ఎలా తప్పింది? ఇది అదృష్టమా? లేక ఏదైనా అదృశ్య శక్తి ఇందులో ఉందా?

Godavari Floods : గోదావరి వరద ముంచెత్తినా తప్పిన ప్రాణ నష్టం.. ప్రజలను కాపాడిన ఆ అదృశ్య శక్తి ఏంటి?

Godavari Floods

Godavari Floods : వందేళ్లలో ఎప్పుడూ చూడని విలయం. గోదావరి మహోగ్ర రూపంలో కోనసీమ, లంక గ్రామాలు వణికిపోయాయి. ప్రస్తుతానికి వరద ఉధృతి తగ్గినా.. ముప్పు ఇంకా పూర్తి స్తాయిలో పోలేదు. ఇలాంటి వరద విరుచుకుపడినా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇళ్లలోకి నీళ్లు చేరి ఇబ్బందులు పడుతున్న జనాలే ఉన్నారే తప్ప ప్రాణ నష్టం అన్న పదం ఎక్కడా వినపడలేదు. వరదల నానుతున్న లంక గ్రామాలకు ఇదే ఇప్పుడు గుడ్ న్యూస్. అసలీ ప్రమాదం ఎలా తప్పింది? ఇది అదృష్టమా? లేక ఏదైనా అదృశ్య శక్తి ఇందులో ఉందా?

గోదావరమ్మ మహోగ్ర రూపం సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. గూడు చెదిరి గుండె పగిలి విలవిలలాడుతున్న ప్రాణాలు ఎన్నో. వందేళ్లలో ఎప్పుడూ చూడని విధంగా భద్రచలాన్ని గోదావరి భయపెడితే.. ఏపీలోని ఏజెన్సీ లంక గ్రామాలు ఇప్పటికీ వణుకుతున్నాయి. ఉగ్రరూపం దాల్చిన గోదావరి శాంతించినా.. విరుచుకుపడిన వరద ఉధృతి తగ్గినా.. ఇప్పటికీ లంక గ్రామాలు, విలీన మండలాల్లోని జనాల పరిస్థితి దయనీయంగానే ఉంది. నిలువ నీడ కరువై, తినడానికి తిండి లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. చుట్టూ నీళ్లు, కూలిన ఇళ్లు, మౌనంగా రోదిస్తున్న కళ్లు.. లంక గ్రామాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి.

Yanam : గోదావరి వరద నీటిలో మునిగిన యానాం

గోదావరి తీరం వెంట జనాలు ఇంకా వరద గుప్పిటలోనే మగ్గుతున్నారు. తినడానికి తిండి, తాగేందుకు నీరు దొరక్క లంక వాసులు అల్లాడుతున్నారు. విలీన మండలాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. కోనసీమ జిల్లాల్లోని 22 మండలాల్లో 75 గ్రామాలు ఇప్పటికీ జలదిగ్బంధంలోనే ఉన్నాయి. బి గన్నవరం మండలంలోని రాజోలు, మామిడికుదురు, సఖినేటిపల్లి లంకల్లో బాధితులు ఇళ్లపైనే తలదాచుకుంటున్నారు. ముమ్మిడివరం, తాళ్లరేవు, కాట్రేనికోన మండలంలోని లంక గ్రామాల జనాలు కనీస అవసరాల కోసం చాలా కష్టాలు పడుతున్నారు. నీట మునిగిన పంటలను చూసి రైతులు కన్నీరు పెడుతున్నారు.

జులై నెలలో వందేళ్లలో ఎప్పుడూ చూడని వరద భయపెట్టినా ముప్పు ఊహించనంత కనిపించలేదు. వచ్చిన వరద వచ్చినట్లే సముద్రంలో కలిసిపోయింది. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇదే ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. మామూలుగా గోదావరి 18 నుంచి 20 లక్షల వరద వచ్చినప్పుడు అది మిగిల్చే బీభత్సం అంతా ఇంతా కాదు. 1986లో గోదావరికి వరదలు వచ్చినప్పుడు వందల ప్రాణాలు నీటిలో కలిసిపోయాయి. అయితే ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇదే ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.

Godavari Floods : గోదావరి వరదతో కోనసీమ విలవిల..ఇంకా అంధకారంలోనే లంకలు, ఏజెన్సీ గ్రామాలు

సరిగ్గా పౌర్ణమి సమయంలో గోదావరికి వరదలు పోటెత్తాయి. మామూలుగా పౌర్ణమి సమయంలో సముద్రం అల్లకల్లోంగా ఉంటుంది. అలలు భారీగా విరుచుకుపడి సముద్రంలో చేరే వరద నీటిని వెనక్కి తోసేస్తుంది. అయితే ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి కనిపించలేదు. గోదావరి వరద వచ్చింది వచ్చినట్లే సముద్రంలో కలిసింది. దీంతో లంకల్లో మునపటి స్థాయిలో వరద నీరు చేరలేదు. ఫలితంగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ స్థాయిలో వరద వెనక్కి వచ్చి లంక గ్రామాలపై విరుచుకుపడి ఉంటే.. ఆ పరిణామాలు తలుచుకోవడానికి కూడా భయంకరంగా ఉంటాయి. ఇప్పుడు వరద ముప్పు తప్పడం అనేది కచ్చితంగా అద్భుతమే అని చెప్పాలి. దీని వెనుక అదృశ్య శక్తి ఏదైనా ఉందా? అనే చర్చ జనాల్లో మొదలైంది.

అసలు పౌర్ణమికి, సముద్రానికి.. సముద్రానికి, వరదలకు.. వరదకు, లంక గ్రామాలకు సంబంధం ఏంటి? అసలు సముద్రపు అలలను చంద్రుడు ఎలా ప్రభావితం చేస్తాడు. గోదావరికి పౌర్ణమి రోజున వరద పోటెత్తినా నష్టం ఊహించనంత జరగలేదు ఎందుకు? నిజంగానే ఏదో శక్తి వెనకుండి నడిపించిందా? గోదావరి మిగిల్చిన పరిణామాలతో జనాల్లో జరుగుతున్న చర్చ ఏంటి?

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

సముద్రం అలజడికి లోనైతే పరిస్థితి ఇంకోలా ఉండేదా? గోదావరి వరద నుంచి కాపాడాని శక్తి ఏంటి? సముద్రంలో అలలకు, చంద్రుడికి సంబంధం ఏంటి? గోదావరి ఉధృతి మిగిల్చిన భయాలు అన్నీ కావు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరక్కపోవడం ఊరటనిచ్చే అంశం. ఈ నెల 11న గోదావరికి వరద పోటెత్తడం మొదలుపెట్టింది. అయితే, వరదకు ఎక్కడా ఎలాంటి అవరోధం కనిపించలేదు. వచ్చిన వరద వచ్చినట్లు అంతా సముద్రంలో చేరిపోయింది. ఈ నెల 13న పౌర్ణమి. పైగా సూపర్ మూన్. ఆ రోజు సముద్రం కాస్త అల్లకల్లోలంగా కనిపించినా, వరద సముద్రంలో కలవడం కష్టమైనా, అదే వరద తిరిగి వెనక్కి మళ్లినా లంక గ్రామాల్లో పరిస్థితి ఊహించుకోవడానికి కూడా భయంకరంగా ఉండేది. చరిత్ర చూడని విలయాన్ని, బీభత్సాన్ని ఈ వరద పరిచయం చేసుండేది.

ఒక రకంగా చెప్పాలంటే సముద్రుడే లంక గ్రామాలను కాపాడాడు. శాంతం వహించాడు. గోదారమ్మను ఒడిలోకి తీసుకున్నాడు. దీంతో ప్రమాదం తప్పిందని లంక గ్రామాల్లో చర్చ జరుగుతోంది. వర్షా కాలంలో సముద్రంలో అలల హోరు ఎక్కువగా ఉంటుంది. అలా జరిగితే సముద్రంలో చేరే వరద నీరు నెమ్మదిగా కదులుతుంది. అదే జరిగుంటే ఇప్పుడు నీళ్లలో కనిపిస్తున్న లంక గ్రామాలు పూర్తిగా కనిపించకపోయేవి. సముద్రంలో ఎలాంటి అలలు కనిపించలేదు. దీంతో వరద నీరు వేగంగా సముద్రంలో కలిసిపోయింది. వందల గ్రామాలను భారీ ప్రమాదం నుంచి బయటపడేలా చేసింది. అలా జరక్కపోయి ఉంటే ప్రాణ నష్టం వేలల్లో కనిపించి ఉండేదన్న భయాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.

పౌర్ణమి రోజున సముద్రంలో ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి. పైగా సూపర్ మూన్ రోజు ఆ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. అలాంటిది ఈ నెల 13న మాత్రం అంతా సాఫీగా సాగిపోయింది. దీంతో వరద ప్రవాహానికి ఎలాంటి అడ్డు కనిపించలేదు. నిజానికి విశాలమైన అంతరిక్షంలో చంద్రుడు మనకు అత్యంత దగ్గరగా ఉంటాడు. మన ఉనికిలో అంతర్ భాగంగా ఉంటాడు. తన కదలికల ద్వారా భూమి మీదున్న జీవరాశిపై ప్రభావం చూపుతుంటాడు. చంద్రుడికి ఉన్న గురుత్వాకర్షణ శక్తి భూమికి చేస్తున్న మేలు అంతా ఇంతా కాదు. సముద్రంలో కనిపించే అలల దగ్గరి నుంచి భూమి మీద రుతువుల వరకు అన్నింటికి కారణం చంద్రుడి గురుత్వాకర్షణ శక్తే. అయితే ఈ పౌర్ణమి నాడు భయపెట్టింది కూడా అదే శక్తి.

Godavari Flood : కూలుతున్న గోదావరి గట్లు.. భయాందోళనలో ప్రజలు

చంద్రుడి మీదుండే గురుత్వాకర్షణ శక్తి భూమిపై ఉన్న సముద్ర నీటిని పైకి లాగేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. చంద్రుడి వెలుగులను బట్టి ఆ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. దానికి గాలి తోడు అయితే ఆ సముద్రపు అలలు భారీ స్థాయికి చేరుకుంటుంది. పౌర్ణమి లాంటి సమయంలో ఆ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. పైగా సూపర్ మూన్ అంటే ఆ ఎఫెక్ట్ మరింత రెట్టింపు స్థాయిలో కనిపిస్తుంది. సముద్రం అల్లకల్లోలంగా మారుతుంది. అదే జరిగితే అలలు భీకరమైన వేగంతో తీరానికి వస్తుంటాయి. ఆ సమయంలో వరద నీరు సముద్రంలో చేరడం కష్టం అవుతుంది. అయితే ఈ నెల 13న మాత్రం ఆ పరిస్థితి కనిపించలేదు. గోదావరి వరద సాఫీగా సముద్రంలో కలిసిపోయింది. భారీ ప్రమాదాన్ని తప్పించింది.

నిజానికి పౌర్ణమి వచ్చిన ప్రతీసారి సముద్రంలో అలలు భారీగా కనిపించవు అన్నది మరికొందరి మాట. భూమి చుట్టూ దీర్ష వృత్తాకార కక్ష్యలో చంద్రుడు తిరుగుతుంటాడు. చంద్రుడి స్థానం మీద అలల వేగం ఆధారపడి ఉంటుంది. నిజానికి సముద్రాల మీదే కాదు భూమిపైనా చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి ప్రభావం చూపిస్తుంది. అయితే ద్రవ రూపంలో ఉండటంతో సముద్రంలో మార్పులు గమనిస్తాం. ఏమైనా గోదావరి ఉగ్రరూపం చూపించిన వేళ సముద్రుడు శాంతం వహించాడు. ఇంకా చెప్పాలంటే చంద్రుడు దయ చూపించాడు. దీంతో గోదావరమ్మ ప్రవాహానికి ఎలాంటి అడ్డూ లేకుండా పోయింది. దీంతో వరద నీరు సముద్రుడి చెంతకు తీరింది. ఏమైనా చరిత్ర గర్తుంచుకునే విలయాన్ని తెలుగు రాష్ట్రాలకు గోదావరమ్మ పరిచయం చేసింది.