YCP Leader Sajjala: కేసీఆర్ ‘భారత్ రాష్ట్ర సమితి’ పార్టీపై.. వైసీపీ నేత సజ్జల రియాక్షన్ ఏమిటంటే?

వైసీపీ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై స్పందించారు. ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడాన్ని స్వాగతిస్తామని తెలిపారు. కొత్త పార్టీల వల్ల పోటీపెరిగి తమ పనితీరును మరింత మెరుగు పర్చుకోవచ్చునన్నారు.

YCP Leader Sajjala: కేసీఆర్ ‘భారత్ రాష్ట్ర సమితి’ పార్టీపై.. వైసీపీ నేత సజ్జల రియాక్షన్ ఏమిటంటే?

KCR BRS

YCP Leader Sajjala: సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించారు. టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) పార్టీని బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి)గా మార్చుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ ప్రకటనను స్వాగతిస్తూ సంబురాలు చేసుకున్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో బీఆర్ఎస్ ను బలోపేతం చేసేందుకు కేసీఆర్ అండ్ టీం ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రధానంగా ఏపీపై కేసీఆర్ దృష్టిసారించారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

Botsa Satyanarayana On BRS: అది వాళ్ల ఇష్టం.. బీఆర్ఎస్ ప్రభావం మాపై ఉండదు: ఏపీ మంత్రి బొత్స

ఏపీలోని పలు పార్టీల్లో సీనియర్ నేతలతో కేసీఆర్ కు మంచి సబంధాలు ఉన్నాయి. ఇప్పటికే వారితో కేసీఆర్ మాట్లాడారన్న టాక్ బీఆర్ఎస్ పార్టీ నేతల నుంచి వినిపిస్తోంది. ఈ క్రమంలో కొందరు కేసీఆర్ వెంట నడిచేందుకుసైతం సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఈ క్రమంలో సంక్రాంతి తరువాత ఏపీలోని గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెడితే ఏ పార్టీకి ఎక్కువ నష్టం వాటిల్లుతుందనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే కేసీఆర్ బీఆర్ఎస్ పై తెలుగుదేశం పార్టీ నుంచి ఎలాంటి స్పందన రాకపోయినప్పటికీ.. వైసీపీ నేతలు స్పందిస్తున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు బీఆర్ఎస్ పార్టీపై సానుకూలంగా స్పందించారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

తాజాగా వైసీపీ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి బీఆర్ఎస్ పార్టీపై స్పందించారు. ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడాన్ని స్వాగతిస్తామని సజ్జల తెలిపారు. కొత్త పార్టీల వల్ల పోటీపెరిగి తమ పనితీరును మరింత మెరుగు పర్చుకోవచ్చునన్నారు. ప్రజల అంశాలపై విధానపరమైన అంశాలతో పార్టీలు వస్తే మంచిదేనని సజ్జల అన్నారు. కొత్త పార్టీల రాకపై మేము విశ్లేషించమని, తమది రాజకీయం కోసం, రాజకీయ ఎత్తుగడలు వేసే పార్టీ కాదని సజ్జల తెలిపారు. ప్రతి అంశాన్ని పారదర్శకంగా అన్నివర్గాల ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, అందుకే ఏపీ ప్రజలు వైసీపీ వెంటే ఉన్నారని అన్నారు.