Political
మూడుకి దారేది : మండలిలో జగన్ సక్సెస్ అవుతారా..?
పాలనా వికేంద్రీకరణ బిల్లుపై ఉత్కంఠ కొనసాగుతోంది. అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లుకు మండలిలో మాత్రం అడ్డంకులు తప్పడం లేదు. నిన్న(జనవరి 21,2020) మండలిలో ఈ
Home » Andhrapradesh » మూడుకి దారేది : మండలిలో జగన్ సక్సెస్ అవుతారా..?
పాలనా వికేంద్రీకరణ బిల్లుపై ఉత్కంఠ కొనసాగుతోంది. అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లుకు మండలిలో మాత్రం అడ్డంకులు తప్పడం లేదు. నిన్న(జనవరి 21,2020) మండలిలో ఈ
Publish Date - 4:38 am, Wed, 22 January 20
By
veegamteamపాలనా వికేంద్రీకరణ బిల్లుపై ఉత్కంఠ కొనసాగుతోంది. అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లుకు మండలిలో మాత్రం అడ్డంకులు తప్పడం లేదు. నిన్న(జనవరి 21,2020) మండలిలో ఈ
పాలనా వికేంద్రీకరణ బిల్లుపై ఉత్కంఠ కొనసాగుతోంది. అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లుకు మండలిలో మాత్రం అడ్డంకులు తప్పడం లేదు. నిన్న(జనవరి 21,2020) మండలిలో ఈ బిల్లుపై చర్చ జరపాలని అధికార పక్షం భావిస్తే… దానిని తిప్పికొట్టింది టీడీపీ. రూల్ 71తో సర్కార్ ప్రయత్నాలకు గండికొట్టింది. దీంతో నిన్న సభలో ప్రతిపక్షానిదే పైచేయి అయింది. అయితే ఆ పార్టీకి కొందరు ఎమ్మెల్సీలు షాకివ్వడం, వారి బాటలోనే మరికొందరు నడిచే అవకాశం ఉందన్న వార్తలతో ఇవాళ(జనవరి 22,2020) ఏం జరగబోతోందన్నది ఉత్కంఠ రేపుతోంది. మండలిలో టీడీపీ అధిపత్యానికి సర్కార్ చెక్ చెప్పగలుగుతుందా? కీలక బిల్లులను ఇవాళైనా ఆమోదింప చేసుకోగలుగుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
మండలిలో వాడివేడి చర్చ తర్వాత రూల్ 71 నోటీసుపై నిర్వహించిన ఓటింగ్లో… టీడీపీ విజయం సాధించింది. నోటీస్కు అనుకూలంగా 27 ఓట్లు, వ్యతిరేకంగా 13 ఓట్లు వచ్చాయి. 9 మంది తటస్థంగా ఉన్నారు. వీరిలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథరెడ్డి వైసీపీకి అనుకూలంగా ఓటేసి షాకిచ్చారు. మరో ఇద్దరు ఎమ్మెల్సీలు.. శత్రుచర్ల, శమంతకమణి సభకు గైర్హాజరయ్యారు. అంతేకాదు..మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా టీడీపీకి ఝలక్ ఇచ్చారు. ఉన్నట్టుండి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.
రూల్ 71కు సంబంధించి టీడీపీ విజయం సాధించిన నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వానికి నిన్న ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. కనీసం ఇవాళైనా కీలక బిల్లులపై చర్చ జరిపి ఆమోద ముద్ర వేయించుకోవాలనుకుంటోంది ప్రభుత్వం. కానీ…. నిన్నటి పరిణామాలతో అది అంత ఈజీకాదని తేలిపోయింది. మరోవైపు…ఏకంగా మండలినే రద్దు చేస్తారని జోరుగా చర్చలు జరిగాయి. దీనికి సంబంధించి సీఎం జగన్ చర్చలు జరుపుతున్నారని, అత్యవసరంగా కేబినెట్ భేటీని కూడా నిర్వహించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ.. అది కార్యరూపం దాల్చలేదు.
* మండలిలో కీలక బిల్లుల (రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు) ఆమోదంపై కొనసాగుతున్న ఉత్కంఠ
* వికేంద్రీకరణ బిల్లు ఆమోదానికి ప్రభుత్వం వ్యూహంపై ఉత్కంఠ
* రూల్ 71 నోటీసుపై చర్చలో విజయం సాధించిన టీడీపీ
* రెండు బిల్లులపై వేర్వేరుగా చర్చ
* టీడీపీ రెండు అస్త్రాలు
* చర్చ అనంతరం సెలెక్ట్ కమిటీ పంపడం లేదా బిల్లులో సవరణలు ప్రతిపాదించడం
* చర్చ ముగిసిన తర్వాత తుది నిర్ణయం చెప్పనున్న టీడీపీ
* సెలెక్ట్ కమిటీకి పంపితే మూడు నెలల పాటు బిల్లు ఆమోదం ఆలస్యం
* సవరణలు సూచిస్తే తిరిగి శాసనసభకు వెళ్లనున్న బిల్లు
* బిల్లుపై ఓటింగ్ కు వెళ్తే పార్టీల్లో చీలిక వచ్చే అవకాశం
* ప్రభుత్వం నెగ్గుతుందా..? బిల్లులు వీగిపోతాయా..?
* రూల్ 71 చర్చలో టీడీపీకి 27మంది మద్దతు
* వైసీపీకి అనుకూలంగా ఓటు వేసిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్సీలు
AP Government : వాలంటీర్లకు మనసారా సెల్యూట్ : సీఎం జగన్
Jagan Tirupati Meeting : కరోనా ఎఫెక్ట్… తిరుపతిలో సీఎం జగన్ సభ రద్దు
తెలుగు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ టెన్షన్
CM Jagan : కరోనా రోగులకు ఉచితంగా చికిత్స : సీఎం జగన్
CM Jagan campaign : తిరుపతి బై పోల్, 14న సీఎం జగన్ ప్రచారం ?
Marriage Cancel : అన్నతో పెళ్లి చూపులు… తమ్ముడితో నిశ్చితార్ధం…