ఏపీ, తెలంగాణలో సూర్యగ్రహణం కనిపించేది ఎప్పుడంటే

  • Published By: madhu ,Published On : June 21, 2020 / 12:48 AM IST
ఏపీ, తెలంగాణలో సూర్యగ్రహణం కనిపించేది ఎప్పుడంటే

ఆకాశంలో కనువిందు ఏర్పడనుంది. సూర్యగ్రహణాల్లో ఒకటైన..వార్షిక సూర్యగ్రహణం 2020, జూన్ 21వ తేదీ ఆదివారం కనిపించి కనువిందు చేయనుంది. ఖగోళ అద్భుత దృశ్యాల్లో ఒకటైన రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ కనిపిస్తుంది. సూర్యుడికి, భూమికి మధ్యలో పూర్తిగా చంద్రుడు వస్తే సంపూర్ణ సూర్యగ్రహణంగా.. కొంతమేర వస్తే పాక్షికమైనదిగా పిలుస్తారు.

ఆదివారం.. సూర్యుడి కేంద్ర భాగానికి మాత్రమే చంద్రుడు అడ్డుగా వస్తుండటంతో వలయాకార సూర్యగ్రహణం ఏర్పడనుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ జ్వాల వలయ సూర్యగ్రహణం 16 సంవత్సరాలకొకసారి వస్తుందని వెల్లడిస్తున్నారు. గ్రహణం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు మూతపడ్డాయి. 

దేశవ్యాప్తంగా తీసుకుంటే సూర్యగ్రహణం ఉదయం గం.9:15 గంటలకు ప్రారంభమై..మధ్యాహ్నం 12:10 గంటలకు అత్యున్నత స్థితికి చేరుకొని మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుందని వెల్లడించారు. అయితే..కొన్ని ప్రాంతాల్లో సూర్యగ్రహణం సమయాల్లో మార్పులు ఉంటాయన్నారు.

గ్రహణం తెలంగాణలో ఉదయం 10.15 గంటల నుంచి 1.44 గంటల వరకు..51 శాతం గ్రహణం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 10.21 గంటల నుంచి మధ్యాహ్నం 1.49 గంటల వరకు 46 శాతం గ్రహణం..విశ్వ వ్యాప్తంగా 3గంటల 33 నిమిషాలపాటు గ్రహణం ఉంటుందని ప్లానెటరీ సొసైటీ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది. 

Must Read: నేడే సూర్యగ్రహణం: సుతక్ కాలం.. ఎప్పుడు, ఎలా, ఎక్కడ? పూర్తి వివరాలు..