మెజారిటీ కార్పోరేషన్లను కైవసం చేసుకునే పార్టీ ఏది? మున్సిపాలిటీల్లో మెరిసే జెండా ఏది?

పంచాయతీ ఎన్నికల వేడి తగ్గేలోపే.. ఏపీలో మున్సిపల్ ఎన్నికలు సెగలు రేపాయి. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి.. పోలింగ్ దాకా పాలిటిక్స్ జోరుగా సాగాయి. మరో 4 రోజుల్లో ఈ ఉత్కంఠకు తెర పడిపోతుంది.

మెజారిటీ కార్పోరేషన్లను కైవసం చేసుకునే పార్టీ ఏది? మున్సిపాలిటీల్లో మెరిసే జెండా ఏది?

ap municipal elections : పంచాయతీ ఎన్నికల వేడి తగ్గేలోపే.. ఏపీలో మున్సిపల్ ఎన్నికలు సెగలు రేపాయి. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి.. పోలింగ్ దాకా పాలిటిక్స్ జోరుగా సాగాయి. మరో 4 రోజుల్లో ఈ ఉత్కంఠకు తెర పడిపోతుంది. మరి.. మెజారిటీ కార్పొరేషన్లను కైవసం చేసుకునే పార్టీ ఏది? మున్సిపాలిటీల్లో మెరిసే జెండా ఏది? ఆంధ్రప్రదేశ్‌లో.. 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా.. నాలుగు మున్సిపాలిటీలు ఏకగ్రీవమయ్యాయి. వీటిని మినహాయించి 71 మున్సిపాలిటీలు, నగరపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. పోలింగ్ సమయంలో.. కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కొన్ని మున్సిపాలిటీల్లో.. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

విశాఖ జీవీఎంసీలో ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. అందువల్ల.. విశాఖ జీవీఎంసీని ఈసారి ఎవరు కైవసం చేసుకుంటారన్నది మోస్ట్ ఇంట్రస్టింగ్‌గా మారింది. విశాఖ జిల్లాలో రెండు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. యలమంచిలి మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుంటుందని చెబుతున్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీనీ మాత్రం టీడీపీ గెల్చుకుంటుందని అంచనా వేస్తున్నారు. విజయనగరం జిల్లాలో.. 3 మున్సిపాలిటీలను, నగర పంచాయతీని.. వైసీపీయే దక్కించుకుంటుందని అంచనా వేస్తున్నారు. విజయనగరం కార్పొరేషన్ పీఠం కూడా వైసీపీకే దక్కే ఛాన్స్ ఉంది. శ్రీకాకుళం జిల్లాలో 3 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. పలాస మున్సిపాలిటీలో వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరి నడిచింది. మిగిలిన రెండు మున్సిపాలిటీల్లోనూ.. వైసీపీ గట్టి పోటీ కనబర్చింది.

కృష్ణా జిల్లాలో ఎన్నికలు జరిగిన 5 మున్సిపాలిటీల్లో.. అధికార వైసీపీయే సత్తా చాటుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న లెక్కల ప్రకారం.. విజయవాడ, మచిలీపట్నం కార్పొరేషన్‌లో కూడా వైసీపీ జెండానే ఎగురుతుందని చెబుతున్నారు. గుంటూరు జిల్లాలో 7 మున్సిపాలిటీలుంటే.. అందులో రెండింటిని వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. ఎన్నికలు జరిగిన 5 మున్సిపాలిటీలు కూడా వైసీపీకే ఛాన్స్ ఉండొచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. గుంటూరు కార్పొరేషన్‌ వైసీపీ ఖాతాలోకే వెళ్లడం ఖాయమంటున్నారు. ఏలూరు కార్పొరేషన్‌లో వైసీపీ మెజారిటీ డివిజన్లు కైవసం చేసుకుంటుందని చెబుతున్నారు. ఒంగోలు కార్పొరేషన్‌లోనూ.. అధికార వైసీపీనే గెలుపు జెండా ఎగరేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

కర్నూలు జిల్లాలో 9 మున్సిపాలిటీలు, 3 నగర పంచాయతీలను వైసీపీయే కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. కర్నూలు కార్పొరేషన్‌లో వైసీపీ గెలుపు జెండా ఎగరేయడం ఖాయంగా కనిపిస్తోంది. కడప జిల్లాలో 7 మున్సిపాలిటీలు, 2 నగర పంచాయతీలున్నాయి. ఇప్పటికే.. పులివెందుల మున్సిపాలిటీని వైసీపీ ఏకగ్రీవం చేసేసింది. మిగిలిన 6 మున్సిపాలిటీలను కూడా వైసీపీయే గెల్చుకునే అవకాశం ఉంది. కడప కార్పొరేషన్ వైసీపీ కైవసం చేసుకోవడం లాంఛనమే అన్న విషయం అందరికీ అర్థమైపోయింది. చిత్తూరు జిల్లాలో ఏకగ్రీవాలతో.. చిత్తూరు కార్పొరేషన్ ఎప్పుడో వైసీపీ కైవసం అయిపోయింది. తిరుపతి కార్పొరేషన్‌ని వైసీపీయే కైవసం చేసుకుంటుందని చెబుతున్నారు. అనంతపురం కార్పొరేషన్ కూడా వైసీపీ ఖాతాలోకి వెళ్తుందన్న అంచనాలే ఎక్కువగా ఉన్నాయి.

రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో.. కొన్ని చోట్ల వైసీపీకి టీడీపీ గట్టి పోటీ ఇచ్చింది. అయినప్పటికీ.. అది మున్సిపాలిటీలను దక్కించుకునే స్థాయిలో అయితే కనబడలేదు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలో మాత్రం జనసేన కాస్త పోటీ ఇచ్చిందని చెబుతున్నారు. ఏదేమైనా.. రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ మున్సిపాలిటీలు, నగర పంచాయతీలను అధికార పార్టీ జెండానే ఎగిరేలా కనిపిస్తోంది.