బాబు ట్వీట్ : కియాను ఎవరు బెదిరించారు ? ఎవరు వేధించారు ?

  • Published By: madhu ,Published On : February 12, 2020 / 04:10 PM IST
బాబు ట్వీట్ : కియాను ఎవరు బెదిరించారు ? ఎవరు వేధించారు ?

ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ట్వీట్లతో విరుచుకపడుతున్నారు. ప్రభుత్వ పాలన సరిగ్గా లేదంటూ టీట్ల వర్షం కురిపిస్తున్నారు. ఏపీలో కియా పరిశ్రమ తరలిపోతోందని, ఇందుకు ప్రభుత్వమే కారణమంటూ బాబు దుమ్మెత్తిపోస్తున్నారు. తాజాగా ట్విట్టర్ వేదికగా బాబు పలు ట్వీట్స్ చేశారు.

* తెరవెనుక జరిగింది ఏమిటి ? కియా సంస్థను ఎవరు బెదిరించారు ? ఎవరు వేధించారు ? వార్తల్లో నిజానిజాలేమిటి ? ప్రజలకు తెలియొద్దా ? వాస్తవాలను నిర్ధారించుకోడానికి వెళ్తున్న నేతలను అరెస్టు చేశారంటే… ఇందులో ప్రభుత్వం దాస్తున్న అంశాలేమిటి ? ప్రభుత్వం వెంటనే సీపీఐ నేతలను విడుదల చేయాలంటూ…2020, ఫిబ్రవరి 12వ తేదీ బుధవారం సాయంత్రం ట్వీట్ చేశారు. 

* కియా పరిశ్రమ గురించి వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిందేనని స్పష్టం చేశారు. కియా తమిళనాడుకు తరలిపోతుందని వార్త రావడం, ఆ వెంటనే కియా ప్రతినిధులతో వైసీపీ నేతలు ఇది నిజం కాదని చెప్పించడం…మరుసటి రోజే మేము రాసింది నిజమే అంటూ ఆ జాతీయ పత్రిక చెప్పడం… ఏమిటివన్నీ? అంటూ ప్రశ్నించారు.

* కియా పరిశ్రమకు వెళ్తున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కారును పోలీసులు వెంబడించి మరీ ఆయనను అరెస్టు చేయడం ఏమిటి ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనేమైనా నేరస్థులా ? అనంతపురం జిల్లాలో సీపీఐ నేతల గృహనిర్బంధాన్ని, అక్రమ అరెస్టులను ఖండిస్తున్నానంటూ బాబు తెలిపారు. 

* ఇటీవలే కియా పరిశ్రమ అనంతపురం నుంచి తమిళనాడుకు తరలిపోతోందంటూ ప్రచారం జరిగింది. 
* టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలోని అనంతపురం జిల్లాలో బిలియన్ డాలర్ల పెట్టుబడితో భారీ ప్లాంటును నెలకొల్పింది కియా. 
* సీఎం జగన్ చేతుల మీదుగా కొత్త కార్ల యూనిట్ ప్రారంభోత్సవం చేసింది.

* ఆంధ్రప్రదేశ్ నుంచి కియా కార్ల పరిశ్రమ తమిళనాడుకు తరలిపోతోందంటూ అంతర్జాతీయ వార్తా సంస్ధ రాయిటర్స్ కథనం రేపిన సంచలనం రేపింది. 
* ఏపీ, తమిళనాడు ప్రభుత్వాలు స్పందించాయి. 
* కియా మోటార్స్ ఎక్కడికీ వెళ్లిపోవడం లేదని, తమిళనాడుతో ఎలాంటి సంప్రదింపులు జరగలేదని వివరణ ఇచ్చాయి. 

* కియా తమతో ఎలాంటి చర్చలు జరపలేదని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది.
* ఆంధ్రప్రదేశ్ నుంచి కియా పరిశ్రమ తరలిపోతోందంటూ వచ్చిన వార్తలను లోక్‌సభలో ప్రస్తావించారు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు.
* కియా పరిశ్రమ ఎక్కడకు తరలిపోవడం లేదని..కేవలం టీడీపీ కుట్ర అంటూ వైసీపీ ప్రభుత్వం వెల్లడించింది. 
* రాయిటర్స్ కథనాన్ని టీడీపీ చూపెట్టింది. అయితే..అనూహ్య పరిణామాల మధ్య రాయిటర్స్ ఈ కథనాన్ని విరమించుకుంది.