Vijayawada : దేవినేనిపై హత్యాయత్నం కేసు, తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం..అసలేం జరిగింది ?

కృష్ణా జిల్లాలో దేవినేని ఉమ అరెస్ట్ వివాదం ముదురుతోంది. దేవినేని ఉమపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నూజివీడు కోర్టులో ఆయన్ను హాజరుపర్చనున్నారు. దేవినేనిపై హత్యాయత్నం కేసు పెట్టడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దేవినేని అరెస్ట్‌పై.. టీడీపీ నేతలతో చంద్రబాబు చర్చించనున్నారు.

10TV Telugu News

Devineni Uma : కృష్ణా జిల్లాలో దేవినేని ఉమ అరెస్ట్ వివాదం ముదురుతోంది. దేవినేని ఉమపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నూజివీడు కోర్టులో ఆయన్ను హాజరుపర్చనున్నారు. దేవినేనిపై హత్యాయత్నం కేసు పెట్టడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దేవినేని అరెస్ట్‌పై.. టీడీపీ నేతలతో చంద్రబాబు చర్చించనున్నారు. అర్థరాత్రి అదుపులోకి తీసుకున్న మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీసులు నందివాడ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.. భారీ భద్రత మధ్య దేవినేని పెదపారుపూడి స్టేషన్ నుంచి నందివాడ స్టేషన్‌కు తరలించారు.

Read More : Cyber Crimes: సైబర్ నేరగాళ్లకు చెక్.. ఆధార్ ద్వారా పట్టేస్తున్న పోలీసులు

పోలీసుల నిర్బందంలో నందివాడ :-
ఈ సమయంలో నందివాడ వెళ్లే మార్గంలో వాహనాలను నిలిపివేశారు.. ప్రస్తుతం నందివాడ సరిహద్దు ప్రాంతాలన్నీ పోలీసుల నిర్బంధంలో ఉన్నాయి.. బారికేడ్లను ఏర్పాటు చేసిన పోలీసులు మీడియాతో సహా ఎవరిని కూడా గ్రామంలోకి అనుమతించడం లేదు.. మరోవైపు నందివాడకు చేరుకునేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నిస్తుండగా… పోలీసులు అడ్డుకుంటున్నారు. దేవినేని ఉమపై జరిగిన దాడిపై తీవ్రంగా ఖండించారు టీడీపీ నేత, పీఏసీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌… దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేశారు.. అక్రమాలను అడ్డుకునే వారిని అడ్డుతొలగించాలని అనుకోవడం దుర్మార్గమని.. వైసీపీ నేతలు చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఐసీయూలో ఉన్నాయని విమర్శించారు..

Read More : Tokyo : వారి మెడలో పతకాలు పడినా..జాతీయ గీతం వినిపించదు

జి.కొండూరు పీఎస్ వద్ద దేవినేని ఆందోళన :-
తన కారుపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని.. తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ జి.కొండూరు పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఆందోళనకు దిగారు దేవినేని ఉమ. సుమారు ఆరు గంటలు పోలీస్‌ స్టేషన్‌ వద్ద కారులోనే.. లాక్‌చేసుకుని కారులోనే కూర్చున్నారాయన. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో.. కారు అద్దాలు పగులగొట్టి ఉమను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. భారీ బందోబస్తు మధ్య.. దేవినేనిని గుడివాడ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అంతకుముందు కొండపల్లి అటవీప్రాంతంలో మైనింగ్‌ పరిశీలనకు వెళ్లిన ఉమను వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారు. ఆ సమయంలో టీడీపీ – వైసీపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. తమ వాహనాలపై వైసీపీ శ్రేణులు రాళ్ల దాడి చేశారని ఉమ ఆరోపించారు. వైసీపీ నేతలను అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేశారు.

Read More : రోజు రోజుకు అతి దారుణంగా మారుతున్న చైనా పరిస్థితి

కారుపై దాడి డ్రామా అంటున్న పోలీసులు :-
మరోవైపు దేవినేని ఉమపై వైసీపీ నేతలు ఫైర్‌ అయ్యారు.. తమ అనుచరులపై దాడి చేసి.. కారు అద్దాలను టీడీపీ కార్యకర్తలే ధ్వంసం చేశారని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ ఆరోపించారు. తమపైనే దాడి చేసి.. దేవినేని ఉమ కారుపై దాడి జరిగిందంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు సైతం మాజీ మంత్రి దేవినేని ఉమ కారుపై దాడి అంతా డ్రామా అంటున్నారు. పక్కా ప్లాన్‌ ప్రకారమే.. అక్రమ మైనింగ్‌ తవ్వకాలు అంటూ దేవినేని ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారని.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించారన్నారు డీఐజీ మోహనరావు అన్నారు. గొడవ ఎవరు చేశారో.. ఎందుకు చేశారో విచారణలో తేలుతుందని.. పూర్తి పారదర్శకంగా విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు..

10TV Telugu News