20 రోజుల్లో 400 శాతం కరోనా కేసులు పెరిగినా.. ఏపీ ప్రభుత్వం, నిపుణుల్లో ఎందుకు ఆందోళన లేదంటే?

  • Published By: sreehari ,Published On : July 28, 2020 / 09:02 PM IST
20 రోజుల్లో 400 శాతం కరోనా కేసులు పెరిగినా.. ఏపీ ప్రభుత్వం, నిపుణుల్లో ఎందుకు ఆందోళన లేదంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. కోవిడ్-19 కేసుల్లో గత 20 రోజుల్లో 400 శాతానికి పైగా పెరిగాయి. ఇప్పటివరకు 1,10,297 కేసులు పెరిగాయి. గత వారంలోనే 50,000కు పైగా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.


రాష్ట్రం రోజుకు సుమారు 50 వేల శాంపిల్స్  పరీక్షించగా, వైరస్ అన్ని జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపించింది. జూలై 23 నుంచి.. తూర్పు గోదావరి జిల్లాలో రోజూ అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. జగన్ ప్రభుత్వం, నిపుణులు కోవిడ్ -19 లాక్ డౌన్ సడలించడమే దీనికి కారణమని అంటున్నారు. రాష్ట్రంలో పెరిగిన పరీక్షల మధ్య ఎక్కువ సంఖ్యలో కేసులు వస్తున్నందున ఆందోళన చెందడానికి ఎలాంటి కారణం లేదు. ఎందుకంటే.. ముందుగానే ఊహించిన ఫలితంగా భావిస్తున్నారు.

2-3 వారాల్లో మరిన్ని కేసులు పెరిగే అవకాశం :
జూలై 9న విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో 23,814 కేసులు నమోదయ్యాయి. జూలై 28 నాటికి, కేసుల సంఖ్య 1.10 లక్షలు పెరగగా.. పరీక్షించిన శాంపిల్స్ సంఖ్య 17,49,425కు చేరింది. ‘కరోనా పరీక్షలు ఎక్కువగా జరిగాయి. అందుకే పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. 1 లక్ష కేసుల వరకు నమోదయ్యాయి. 16 లక్షల మందిని పరీక్షించామని ఆంధ్రప్రదేశ్‌లోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ భాస్కర్ కటమనేని చెప్పారు.


లాక్ డౌన్ ఎత్తివేయడంతో కరోనా కేసులు బాగా పెరిగాయి. కంటెమెంట్ జోన్లలో చాలా పరీక్షలు నిర్వహించామన్నారు. ఎక్కువ పాజిటివిటీ రేటును ఊహించామని చెప్పారు. కరోనా పరీక్షలు రోజువారీ సగటు 50,000 గా నమోదయ్యాయని ఇందులో ఎలాంటి సమస్య కనిపించడం లేదని ఆయన అన్నారు. తూర్పు గోదావరిలో రోజువారీ కరోనా కేసులు తీవ్రంగా ఉన్నాయి. జిల్లాలో 50 లక్షల జనాభాలో కరోనా అత్యధికంగా ఉందని అన్నారు.

కోవిడ్ -19 రోగులకు 4,300 ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU) పడకలు, 17,300 నాన్-ఐసియు ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి. ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స చేయడానికి రాష్ట్రానికి 39,000 పడకల సామర్థ్యం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది.


ఇందులో కోవిడ్ -19 చికిత్స కోసం రోగులకు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఇతర వ్యాధుల చికిత్స కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులలో ఇంకా 6,000 పడకలు ఉన్నాయి. కొమోర్బిడిటీ ఉన్నవారిని త్వరగా గుర్తించేలా రాష్ట్ర ప్రభుత్వం తమవంతు కృషి చేస్తోందని, తద్వారా వారి ప్రాణాలకు ప్రమాదం లేదని అన్నారు. జూలై 28న, కోవిడ్ -19కు 62,979 మంది పరీక్షించగా 7,948 మంది పాజిటివ్ అని వచ్చింది. రాష్ట్రంలోని 5.34 కోట్ల మందిలో 17,49,425 మందిని పరీక్షించినట్లు ఏపీ ప్రభుత్వం నుంచి సమాచారంగా తెలుస్తోంది.

జూలై 22, 28 మధ్య, కోవిడ్ -19 కేసులు రోజుకు సగటున 7,300 గా నమోదయ్యాయి. జూలై 24న 8,147 ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి, ఇప్పటివరకు APలో అత్యధిక రోజువారీ కేసులుగా గుర్తించారు. AP పాజిటివిటీ రేటు 6.3 శాతంగా నమోదు కాగా.. మరణాల రేటు 1.04 శాతంగా నమోదైందని చెప్పారు. కరోనాతో రాష్ట్రంలో 1,148 మంది మృతి చెందగా, మంగళవారం నాటికి రికవరీల సంఖ్య 52,622 గా నమోదైంది.


కరోనా కేసుల లెక్కల్లో ఏపీ నిజాయితీ :
హైదరాబాద్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రొఫెసర్ డాక్టర్ బిఆర్ షమన్న చెప్పిన ప్రకారం.. ఏపీలో ఏమి జరుగుతుందో ముందే ఊహించారు. అధిక కరోనా పరీక్షలు చేస్తున్న మొదటి రాష్ట్రాల్లో AP ఒకటిగా ఉంది. తిరుపతి, కర్నూలు, అనంతపురం వంటి రాష్ట్రాలలో ప్రాంతాల్లో అవగాహన కల్పించారు.

ఆంధ్ర పరీక్షా రేటు మిలియన్‌కు 32,761తో పోలిస్తే, తెలంగాణ సగటు కేవలం 9,000కు పైగా ఉంది. 2014లో ఆంధ్ర నుంచి తరువాతి రాష్ట్రం జూలై 27 నాటికి మొత్తం 3,79,081 పరీక్షలు నిర్వహించింది. మొత్తం కోవిడ్ -19 కేసులు 57,142 వద్ద నమోదు అయ్యాయి. రాష్ట్రంలో మల్టీపుల్ మొబైల్ టెస్టింగ్ ల్యాబ్‌లను ప్రారంభించింది. నివాసితులకు ఉచిత పరీక్షలు, ఫలితాలను 48 గంటల్లో అందిస్తోంది.