కోట్ల రూపాయల ఆదాయం, BMW కార్లు, బంగళాలు, లగ్జరీ లైఫ్.. అందుకే ప్రాణాలకు తెగించి రిస్క్ చేస్తున్నారు? ఎర్రచందనం స్మగ్లర్లుగా మారుతున్నారు?

  • Published By: naveen ,Published On : November 9, 2020 / 03:01 PM IST
కోట్ల రూపాయల ఆదాయం, BMW కార్లు, బంగళాలు, లగ్జరీ లైఫ్.. అందుకే ప్రాణాలకు తెగించి రిస్క్ చేస్తున్నారు? ఎర్రచందనం స్మగ్లర్లుగా మారుతున్నారు?

red sandalwood smugglers: ఒక్క నిర్ణయం జీవితాన్ని మార్చేయొచ్చు. అది మనం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఒక వేళ అది మంచి నిర్ణయమైతే జీవితం సాఫీగా సాగిపోతుంది. కానీ కొంతమంది తాము తీసుకునే నిర్ణయం సరైనది కాదని తెలిసినా ప్రాణాలకు తెగించి మరీ రిస్క్ చేస్తుంటారు. అలాంటోళ్లే ఎర్రచందనం స్మగ్లర్లు. తాము తప్పు చేస్తున్నామని తెలుసు. అయినా ఏమాత్రం వెనుకాడరు. ఎందుకు వాళ్లకంత దీమా? ఎర్రచందనంలో ఏముంది? దానికోసం ఎందుకు ప్రాణాలిస్తున్నారు.. అవసరమైతే ప్రాణాలు తీస్తున్నారు..?



https://10tv.in/police-arrest-red-sandalwood-smuggler-basha-bhai/
సూట్‌కేసుల నిండా నోట్ల కట్టలు.. గోల్డెన్ వాచ్‌లు.. BMW కార్లు.. పెద్ద పెద్ద బంగళాలు.. విదేశాల్లో షికార్లు….. విలాసవంతమైన జీవితం.. పొలిటీషియన్లతో సత్సంబంధాలు.. చెప్పుచేతల్లో అధికారులు.. సినీ స్టార్స్‌తో చెట్టపట్టాలు.. ఇంతకంటే జీవితానికి ఇంకేం కావాలి.. అందుకే ఎర్రచందనం స్మగ్లర్లు ఏమాత్రం వెనుకాడట్లేదు. దొరికితేనే దొంగ ముద్ర వేయించుకుంటున్నారు. లేకుంటే దొరలాగా జీవితాన్ని గడిపేస్తున్నారు. పది మందిలో ఒక్కరు మాత్రమే చిక్కుతుంటే.. 9మంది మంది దర్జాగా ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే రెడ్ శాండల్‌ స్మగ్లింగ్‌పై అంత మోజు.!