Home » Andhrapradesh » పప్పు గుత్తితో భర్తను హత్య చేసిన భార్య…….ప్రియుడికోసం
Updated On - 5:58 pm, Tue, 22 September 20
By
murthyAP crime news అక్రమ సంబంధాల మోజులో కాపురాల్లో చిచ్చు పెట్టకుంటున్నారు కొందరు మహిళలు. ప్రియుడి మోజులో పడి తాళి కట్టిన భర్తను ఒక్క దెబ్బకు హత్య చేసింది అనంతపురానికి చెందిన మహిళ.జిల్లాలోని దొడగట్ట గ్రామానికి చెందిన శ్ర్రీనివాస్ చౌదరి9 సంవత్సరాలక్రితం సరిత అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వారికి 7 సంవత్సరాల కుమార్తె ఉంది.
సరిత అదే గ్రామానికి చెందిన ప్రభాకర్ అనే వ్యక్తి మోజులో పడింది. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్తకు తెలియకుండా సరిత ప్రభాకర్ తో లైంగిక సంబంధం పెట్టుకుంది. గుట్టగు సరిత ప్రభాకర్ తో రాసలీలలు కొనసాగించింది. కొన్నాళ్లకు సరిత రాసలీలల వ్యవహారం శ్రీనివాస్ పసిగట్టాడు. దీంతో భార్యను నిలదీశాడు. ప్రవర్తన మార్చుకోమని హెచ్చరించాడు. అయినా సరిత భర్త మాటను లెక్కచేయలేదు. ప్రభాకర్ తో వివాహేతర సంబంధం కొనసాగిస్తూనే ఉంది.
భార్య ప్రవర్తనతో మనస్తాపానికిగురైన శ్రీనివాస్ మద్యానికి బానిసయ్యాడు. తాగి వచ్చి రోజూ భార్యతో గొడవ పడటం మొదలెట్టాడు. ఆదివారం సెప్టెంబర్ 20న కూడా తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడటం మొదలెట్టాడు. భార్యా భర్తల మధ్య గొడప పతాక స్ధాయికి చేరటంతో సరిత దగ్గరలో ఉన్న పప్పు కాడ తో శ్రీనివాస్ తలపై ఒక్కటిచ్చుకుంది. దెబ్బ గట్టిగా తగలటంతో శ్రీనివాస్ అక్కడి కక్కడే మరణించాడు.
ఆ తర్వాత హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించటానికి శ్రీనివాస్ శవాన్ని సమీపంలోని చెట్టు వద్దకు తీసుకువెళ్లి ఉరివేసి ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ ….. ప్రియుడు ప్రభాకర్ సాయంతో తన కొడుకును సరిత హత్య చేసిందని శ్రీనివాస్ తండ్రి రామచంద్రప్ప పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సరితను, ప్రభాకర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Visakha Oxygen Plant : ప్రాణవాయువుకు పెరుగుతున్న డిమాండ్.. అందరి దృష్టంతా విశాఖ ఆక్సిజన్ ప్లాంట్ పైనే
Cinema Theatres : ఏపీలోనూ సినిమా థియేటర్లు బంద్..?
Vehicles Auction : క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి కాదు…వేలం పాటకు వచ్చారు…అసలు కథేంటంటే!
Acid attack on cows : దారుణం : ఆవులపై యాసిడ్ దాడి
Hanuman Birth place : వెంకటాద్రే అంజనాద్రి తేల్చి చెప్పిన టీటీడీ
Domestic violence : భర్త రెండో పెళ్లికి .యత్నాలు…బలవన్మరణానికి పాల్పడిన భార్య