సీఐడీ విచారణకు హాజరు కావాలా?వద్దా? చంద్రబాబు అరెస్ట్ అవుతారా?

సీఐడీ విచారణకు హాజరు కావాలా?వద్దా? చంద్రబాబు అరెస్ట్ అవుతారా?

Cid Notices To Former Ministers Chandrababu With Legal Experts

అమరావతి రాజధాని భూముల కొనుగోలు అక్రమాలపై ఏపీ సీఐడీ దూకుడు పెంచింది. మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి 41 సీఆర్పీసీ కింద నోటీసులు చేసింది. ఈనెల 23వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. గతంలో రాజధాని భూముల కొనుగోలు, అమ్మకాలపై.. తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్‌ను సీఐడీ అరెస్ట్ చేసింది

ఈ వ్యవహారంలో చంద్రబాబు న్యాయవాదులతో చర్చిస్తున్నారు. సీఐడీ జారీ చేసిన నోటీసులపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. సీఐడీ నోటీసులపై కోర్టుకు వెళ్లే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు న్యాయ నిపుణులు. మార్చి 23న సీఐడీ విచారణకు హాజరు కావాలా? వద్దా? అనే అంశంపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు చంద్రబాబు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై హైకోర్టు ఇప్పటికే ఇచ్చిన ఆదేశాలను న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు చంద్రబాబు.

మార్చి 23వ తేదీన విచారణకు హాజరు కావాలని చంద్రబాబుకు నోటీసులు ఇవ్వగా.. 23వ తేదీ ఉదయం 11గంటలకు విజయవాడ సత్యనారాయణపురం సీఐడీ ఆఫీసుకు రావాలని అందులో పేర్కొన్నారు. విచారణకు హాజరుకాకపోతే సెక్షన్‌ 41A(3)కింద అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని సీఐడీ అధికారులు చెబుతున్నారు.

అవసరమైన డాక్యుమెంట్లతో రావాలని సూచించిన సీఐడీ అధికారులు.. విచారణకు ఎలాంటి ఆటంకం కలిగించకూడదదని నోటీసుల్లో వెల్లడించారు. సాక్ష్యులను బెదిరించకూడదని, వారిని సంప్రదించకూడదని సూచించారు. సాక్ష్యాలు నాశనం చేసే ప్రయత్నం చేస్తే చర్యలు చెయ్యరాదని నోటీసుల్లో పేర్కొన్నారు.