Medical Health Strike : డిమాండ్లు నెరవేర్చకుంటే 7నుంచి సమ్మె..! ప్రభుత్వానికి వైద్యఆరోగ్య శాఖ ఉద్యోగుల హెచ్చరిక

తమ 4 డిమాండ్లపై ప్రభుత్వం స్పందించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరిగే నిరవధిక సమ్మెకి మద్దతిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు ప్రకటించారు.

Medical Health Strike : డిమాండ్లు నెరవేర్చకుంటే 7నుంచి సమ్మె..! ప్రభుత్వానికి వైద్యఆరోగ్య శాఖ ఉద్యోగుల హెచ్చరిక

Medical Health Strike

Medical Health Strike : పీఆర్సీ విషయమై ఇప్పటికే ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారు. ఫిబ్రవరి 7 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఇప్పుడు మరో శాఖ ఉద్యోగులు కూడా సమ్మె యోచనలో ఉన్నారు. తమ డిమాండ్లు నెరవేర్చకుంటే తాము కూడా సమ్మె చేస్తామని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు చేపట్టనున్న సమ్మెకి ఏపీ వైద్యఆరోగ్య శాఖ మద్దతిచ్చింది. ఫిబ్రవరి 7 నుంచి తాము సైతం సమ్మెలో పాల్గొంటామని వైద్య ఆరోగ్య శాఖ జేఏసీ స్పష్టం చేసింది. ఫిబ్రవరి 3న జరిగే చలో విజయవాడను విజయవంతం చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల జేఏసీ నేత ఆస్కార్ రావు చెప్పారు.

Fish : వారానికి ఓసారి చేపలు తింటే.. పక్షవాతం ముప్పు తప్పుతుందా..?

వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు జేఏసీగా ఏర్పడ్డారు. పీఆర్సీ సాధన సమితితో కలిసి తమ సమస్యలపై పోరాటానికి ముందుకు వచ్చామన్నారు. ప్రభుత్వం ముందు ప్రధానంగా 4 డిమాండ్లు ఉంచారు. జీవో 64 రద్దు చేయాలి, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ వైద్య సిబ్బందిని రెగులరైజ్ చేయాలి, సీపీఎస్ రద్దు చేయాలి, ఎమర్జెన్సీగా బదిలీల జీవో ఇవ్వడం అనేది ఈ సమయంలో కరెక్ట్ కాదన్నారు. ఈ నాలుగు డిమాండ్లపై ప్రభుత్వం స్పందించి తమకు హామీ ఇచ్చే వరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. చలో విజయవాడలో పాల్గొంటామని, ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరిగే నిరవధిక సమ్మెకి మద్దతిస్తున్నామని వైద్య ఆరోగ్య ఉద్యోగుల జేఏసీ తెలిపింది.

సమ్మెపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలో తాము కానీ సమ్మె చేస్తే పరిస్థితి దారుణంగా ఉంటుందన్నారు. కరోనా రోగుల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని ఈరోజు వరకు తాము సమ్మెపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. కానీ, పరిస్థితి మా చేయి దాటిపోతోందని హెచ్చరించారు. మిగతా శాఖల ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో అదే విధంగా తమతోనూ ప్రభుత్వం మాట్లాడాలని అన్నారు.

Covid HIV Patient : కరోనా సోకిన ఆ HIV పేషెంట్ శరీరంలో ఏకంగా 21 మ్యుటేషన్లు.. అధ్యయనంలో తేల్చిన సైంటిస్టులు..!

వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమస్యలు చాలా ప్రత్యేకంగా ఉంటాయన్నారు. జీవో నెంబర్ 64కు వ్యతిరేకంగా చాలా పోరాటం చేశామన్నారు. జీవో 64 ను రద్దు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు దాన్ని రద్దు చేయలేదన్నారు. మెజారిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయ్స్ వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నారని చెప్పారు. ఇప్పటివరకు రెగులరైజ్ చేయలేదన్నారు.

కరోనా మహమ్మారి సమయంలో సమ్మెకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే అది కచ్చితంగా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ సమయంలో తాము సమ్మె చేయకపోతే తమ భవిష్యత్తు తరాలు తమను క్షమించవన్నారు. దశలవారిగా ఉద్యోగులతో పాటు ఫిబ్రవరి 7నుంచి సమ్మెకి సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఏ క్షణమైనా ఉద్యోగులతో పాటు అత్యవసరమైన కరోనా వైద్యాన్ని పక్కన పెడితే మిగతా అన్నింటిని తాము కూడా బహిష్కరిస్తామని వైద్య ఆరోగ్య ఉద్యోగులు తేల్చి చెప్పారు.