Kodali Nani : త్వరలో రైతుల ఖాతాల్లోకి డబ్బులు, మంత్రి కొడాలి నాని

ధాన్యం బకాయిలు రైతులకు చెల్లించడం లేదని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. రైతుల ముసుగులో టీడీపీ నేతలు నాటకాలాడుతున్నారని మండిపడ్డారు.

Kodali Nani : త్వరలో రైతుల ఖాతాల్లోకి డబ్బులు, మంత్రి కొడాలి నాని

Kodali Nani

Kodali Nani : ధాన్యం బకాయిలు రైతులకు చెల్లించడం లేదని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. రైతుల ముసుగులో టీడీపీ నేతలు నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో రైతులను పట్టించుకోలేదన్నారు. చంద్రబాబు పాలనలో ఐదేళ్లలో చెల్లించింది తాము ఏడాదిలోనే చెల్లించామన్నారు.

ధాన్యం కొనుగోలు చేసి రైతులకు డబ్బులివ్వలేదని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. రెండేళ్లలో 83 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని వివరించారు. కేంద్రం రాష్ట్ర సివిల్ సప్లయ్ 5వేల 056 కోట్లు చెల్లించాలని, ఈ నెలాఖరులోగా రైతులకు ఇవ్వాల్సిన ప్రతిపైసా కూడా ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. రైతు రాజులా బతకాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు.

”సోమవారం, మంగళవారాల్లో రూ.1600 కోట్లు రైతుల ఖతాల్లో జమ చేస్తాం. ఈ నెలాఖరులోపు రైతులకు మొత్తం బకాయిలు చెల్లిస్తాం. గత ప్రభుత్వం ఎప్పుడైనా 21 రోజుల్లో ఒక్క రైతుకైనా రూ.5వేలు చెల్లించిందా? మా ప్రభుత్వంలో ఏడాదికి 83లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం” అని మంత్రి కొడాలి నాని అన్నారు.