TTD EO Dharma Reddy : టీటీడీ ఈవో పదవికి రాజీనామా చేస్తా-ధర్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

టీటీడీ ఈవో ధర్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యాలు లేవని నిరూపిస్తే.. ఈవో పదవికి రాజీనామా చేస్తానని అన్నారు ధర్మారెడ్డి. తిరుమలలో టీటీడీ గదులకు అద్దె పెరిగిందని జరుగుతున్న ప్రచారంపై ఈవో ధర్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఐపీ బ్రేక్ దర్శనాలు, వీఐపీ రూమ్ లు పొందుతున్న వారే నిన్న తిరుపతి కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారని అన్నారు.

TTD EO Dharma Reddy : టీటీడీ ఈవో పదవికి రాజీనామా చేస్తా-ధర్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

TTD EO Dharma Reddy : టీటీడీ ఈవో ధర్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యాలు లేవని నిరూపిస్తే.. ఈవో పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. తిరుమలలో టీటీడీ భక్తులకు ఇచ్చే వసతి గదులకు అద్దె పెరిగిందని జరుగుతున్న ప్రచారంపై ఈవో ధర్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఐపీ బ్రేక్ దర్శనాలు, వీఐపీ రూమ్ లు పొందుతున్న వారే నిన్న తిరుపతి కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారని అన్నారు.

172 రూమ్ లకు వీఐపీ స్థాయి సదుపాయాలు కల్పించామన్న టీటీడీ ఈవో ధర్మారెడ్డి, ఆ గదులకు కూడా అద్దె పెంచినట్లు కాదన్నారు. ఆధునీకరించిన రూముల అద్దెను వీఐపీ రూమ్ ల అద్దెకు సమానం చేశామని వివరణ ఇచ్చారాయన. సామాన్య భక్తులకు కేటాయించే గదులకు అద్దె పెంచలేదని ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు.

Also Read..Tirumala Temple Ornaments : కోటి విలువ చేసే కిలో బంగారం.. తిరుమల శ్రీవారికి భారీ విరాళం

ఇది ఇలా ఉంటే.. తిరుమలలో భక్తులకు టీటీడీ అద్దెకు ఇచ్చే వసతి గృహాల అద్దె పెంపు వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. టీటీడీ నిర్ణయాన్ని తప్పుబడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది బీజేపీ. తిరుమలలో అద్దె గదుల ధరల పెంపుపై బీజేపీ నేతలు భగ్గుమన్నారు. పెంచిన ధరలు తగ్గించాల్సిందేనని, లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి డబ్బు ఏమైనా తక్కువైందా? ఏ ఆలయానికి లేనంత ఆదాయం టీటీడీకి వస్తుంటే, అద్దె గదుల ధరలు పెంచాల్సిన అవసరం ఏమొచ్చిందంటున్నారు బీజేపీ నేతలు. తిరుమల శ్రీవారిని భక్తులకు దూరం చేయాలనుకుంటున్నారా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

కాగా, అద్దె గదుల ధరల పెంపును సమర్ధించుకుంది టీటీడీ. ఆధునీకరించాం.. అందుకే అద్దె పెంచామని క్లారిటీ ఇచ్చారు టీటీడీ ఈవో. అయితే, సామాన్యుల గదుల ధరలను పెంచలేదని వివరణ ఇచ్చారాయన.

Also Read..TTD Shocked Devotees : శ్రీవారి భక్తులకు టీటీడీ ఝలక్.. తిరుమలలో వసతి గదుల అద్దె భారీగా పెంపు

తిరుమలలో మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉన్న నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకులమాత వసతి గృహాల్లో అద్దెను ఒక్కసారిగా రూ.500 నుంచి వెయ్యి రూపాయలకు పెంచారు. అలాగే నారాయణగిరి రెస్ట్ హౌస్ లోని 1,2,3 గదులను 150-250 ఉండే అద్దెను జీఎస్టీతో కలిపి 1700 రూపాయలకు పెంచారు. ఇక రెస్ట్ హౌస్‌లోని 4లోని ఒక్క గది అద్దె 750 ఉండగా దానికి వెయ్యి రూపాయలు అదనంగా పెంచి 1700 చేశారు. ఇక కార్నర్ సూట్‌ను జీఎస్టీతో కలిపి 2200 రూపాయలు, స్పెషల్ టైప్ కాటేజీల్లో 750రూపాయల గదిని 2800 రూపాయలకు పెంచారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఇక గది అద్దెతో పాటు అంతే మొత్తం నగదు డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుందని కొత్త ప్రతిపాదన కూడా పెట్టింది టీటీడీ. అంటే 1700 రూపాయల గది అద్దెకు కావాలంటే అడ్వాన్స్‌తో కలిపి 3400 చెల్లించాల్సి ఉంటుంది. గదుల అద్దెలు పెంచి ఆదాయం పెంచుకోవాలని చూస్తున్న టీటీడీ పాలక మండలి నిర్ణయంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వామి భక్తులను నిలువు దోపిడీ చేసుకోవడం ఎంత మాత్రం సరికాదని అంటున్నారు. ఆధ్యాత్మిక కేంద్రాన్ని వ్యాపార కేంద్రంగా కాకుండా భక్తుల కోణంలో చూడాలని కోరుతున్నారు.