Nara Lokesh On Scams : మహానాడు తర్వాత కుంభకోణాలు బటయపెడతా-నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు

వైసీపీ ప్రభుత్వంపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు నారా లోకేశ్. మహానాడు తర్వాత కుంభకోణాలను బటయపెడతానని చెప్పారు. పక్కా ఆధారాలు ఉన్నాయని తెలిపారు.(Nara Lokesh On Scams)

Nara Lokesh On Scams : మహానాడు తర్వాత కుంభకోణాలు బటయపెడతా-నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh On Scams (1)

Nara Lokesh On Scams : వైసీపీ ప్రభుత్వంపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు టీడీపీ నేత నారా లోకేశ్. మహానాడు సందర్భంగా మీడియాతో చిట్ చాట్ లో లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహానాడు తర్వాత వైసీపీ ప్రభుత్వం కుంభకోణాలను బటయపెడతానని చెప్పారు. కుంభకోణాలకు సంబంధించి పక్కా ఆధారాలు ఉన్నాయని లోకేశ్ తెలిపారు.

సీఎం జగన్ దావోస్ పర్యటనపై లోకేశ్ విమర్శలు చేశారు. అదానీ, అరబిందో, గ్రీన్ కో తో ఒప్పందాలు చేసుకోవడానికి దావోస్ వెళ్లాలా? అని ప్రశ్నించారు. ఎన్నికలు, పొత్తులపైనా లోకేశ్ రెస్పాండ్ అయ్యారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

TDP Mahanadu : ‘క్విట్ జగన్..సేవ్ ఏపీ’ నినాదంతో తెలుగుదేశం పార్టీ మహానాడు

మహానాడు తర్వాత ప్రభుత్వం చేసిన కుంభకోణాలు బయటపెడతా. ఆ కుంభకోణాలకు సంబంధించిన పక్కా ఆధారాలు ఉన్నాయి. అదానీ, అరబిందో, గ్రీన్ కో తో ఒప్పందానికి దావోస్ వెళ్లాలా? ఎన్నికలు ఎప్పుడొచ్చినా మేము సిద్ధమే. జగన్ తన పార్టీ కార్యకర్తలను గాలికి వదిలేశారు. వైసీపీ క్యాడరే ఆ పార్టీ నేతలపై తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చింది. పార్టీ ఆదేశిస్తే పాదయాత్రే కాదు ఎలాంటి పోరాటానికైనా సిద్ధం. ప్రజల కోసమే పవన్, చంద్రబాబు కలవాలని మాట్లాడారు. ఎన్నికల సమయంలో పొత్తుల చర్చ కామన్.(Nara Lokesh On Scams)

Lokesh On TDP Changes : వరుసగా మూడుసార్లు ఓడినోళ్లకి నో టికెట్, టీడీపీలో సంస్ధాగతంగా సంచలన మార్పులు..!

మహానాడు సందర్భంగా నారా లోకేశ్ మీడియాతో అరగంట పాటు చిట్ చాట్ చేశారు. కీలక, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీలో రానున్న సంస్థాగత మార్పుల గురించి లోకేశ్ సంకేతాలు ఇచ్చారు. పదవులు, టికెట్ల గురించి స్పష్టత ఇచ్చారు. పార్టీకి గుదిబండగా మారిన సీనియర్లను పక్కన పెట్టేస్తామని, వరుసగా మూడు సార్లు ఓడిన వారికి టికెట్ ఇచ్చే ప్రశ్నే లేదని లోకేశ్ తేల్చి చెప్పారు.

Kodali Nani: టీడీపీకి ప్రజలు సమాధి కడతారు: కొడాలి నాని

ప్రభుత్వం చేసిన కొన్ని కీలకమైన స్కామ్ లను తాము కనిపెట్టామని, మహానాడు తర్వాత వాటన్నింటిని బహిర్గతం చేస్తామన్నారు. ఇప్పుడే ఆ విషయాలన్నీ మాట్లాడితే మహానాడు డైవర్ట్ అవుతుందని చెప్పారు. టీడీపీలో సంస్థాగత మార్పులు, ప్రభుత్వం స్కామ్ ల గురించి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యల గురించి మహానాడు వేదికగా టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు.

ప్రకాశం జిల్లా ఒంగోలులో టీడీపీ ‘మహానాడు’ అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌, పొలిట్‌బ్యూరో సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మహానాడులో పాల్గొన్నారు.(Nara Lokesh On Scams)

గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత టీడీపీ తన వార్షిక మహానాడు సమావేశాలను ప్రజల మధ్యలో నిర్వహించడం ఇదే మొదటిసారి కావడంతో కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. ఒంగోలు పట్టణమంతా పసుపు జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఈ మహానాడులో టీడీపీ 17 తీర్మానాలను ఆమోదించనుంది.

మహానాడులో వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. పసుపు రంగు శుభాన్ని సూచిస్తుందని.. అటువంటి పాలనే తమ హయాంలో ప్రజలకు అందించామన్నారు. కానీ, వైసీపీ ప్రభుత్వం వచ్చాక అంతా అరాచకమే తప్ప ఎక్కడా అభివృద్ధి జాడ కూడా కనిపించట్లేదని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వ పాలనలో హింస పెరిగిపోయిందన్నారు. ఇటువంటి అరాచక పాలనకు చరమగీతం పాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘క్విట్ జగన్..సేవ్ ఏపీ’ నినాదంతో ఈ మహానాడు జరుపుకుందామని చంద్రబాబు అన్నారు.