Survey: పురుషులకంటే మహిళలకే శృంగార భాగస్వాములు ఎక్కువ… తెలుగు రాష్ట్రాల్లో మాత్రం..

దేశంలో పురుషులకంటే స్త్రీలకే ఎక్కువ మంది శృంగార భాగస్వాములున్నట్లు తాజా సర్వే వెల్లడించింది. దాదాపు 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో స్త్రీలకే ఎక్కువ మంది భాగస్వాములున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పురుషులకే ఎక్కువ మంది భాగస్వాములున్నారు.

Survey: పురుషులకంటే మహిళలకే శృంగార భాగస్వాములు ఎక్కువ… తెలుగు రాష్ట్రాల్లో మాత్రం..

Survey: దేశంలోని 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పురుషులకంటే మహిళలకే శృంగార భాగస్వాములు ఎక్కువగా ఉన్నారని తాజా సర్వే తేల్చింది. 2019-2021కి సంబంధించి కేంద్రం నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్‌హెచ్ఎస్) ద్వారా ఈ విషయాలు వెల్లడయ్యాయి. దేశంలోని 707 జిల్లాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో, 1.1 లక్ష మంది మహిళలు, 1 లక్ష మంది పురుషులపై నిర్వహించిన సర్వే ద్వారా ఈ సంచలన విషయాలు తెలిశాయి.

Chiranjeevi Hospital : మెగాస్టార్ చిరంజీవి గొప్ప మనసు.. సినీ కార్మికుల కోసం ఆసుపత్రి నిర్మాణం

సర్వే నిర్వహించడానికి 12 నెలల ముందు వరకు వివరాల్ని అడిగి తెలుసుకుని ఈ నివేదిక రూపొందించారు. సర్వే ప్రకారం.. రాజస్థాన్, హరియాణా, జమ్ము-కాశ్మీర్, లదాఖ్, మధ్యప్రదేశ్, అసోం, కేరళ, ఛండీఘర్, లక్షద్వీప్, పుదుచ్చేరి, తమిళనాడులో మహిళలు ఒకరికంటే ఎక్కువ మంది శృంగార భాగస్వాముల్ని కలిగి ఉన్నారు. అన్నింటికంటే ఎక్కువగా రాజస్థాన్‌లో మహిళలు ఎక్కువ మంది శృంగార భాగస్వాముల్ని కలిగి ఉన్నారు. ఈ రాష్ట్రంలో మహిళలు సగటున 3.1 మంది భాగస్వాముల్ని కలిగి ఉంటే, పురుషులు 1.8 మంది భాగస్వాముల్ని కలిగి ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లోని వారికంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ఇలా ఎక్కువ మంది శృంగార భాగస్వాములున్నారు.

MLAs son-in-law: ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో ఎమ్మెల్యే అల్లుడు ఆత్మహత్య

ఇక తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మహిళలతో పోలిస్తే పురుషులకే ఎక్కువ మంది శృంగార భాగస్వాములున్నారు. ఏపీలో ఒక్కో పురుషుడికి సగటున 4.7 మంది మహిళలతో సంబంధాలు ఉండగా, మహిళలకు 1.4 మందితో సంబంధం ఉంది. తెలంగాణలో పురుషులకు 3.0 మంది మహిళలతో సంబంధాలు ఉండగా, స్త్రీలకు సగటున 1.7 మందితో భాగస్వామ్యం ఉంది. ఈ సర్వే నిర్వహించిన ఏడాది కాలానికి సంబంధించి తమ జీవిత భాగస్వామితో మాత్రమే శృంగారంలో పాల్గొన్నామని చెప్పిన పురుషులు 4 శాతంకాగా, మహిళలు 0.5 శాతం మాత్రమే ఉన్నారు.