ఇడుపులపాయ బంకర్‌లో కూర్చొని పాలించండి..జగన్‌కు యనమల సూచన

  • Published By: madhu ,Published On : January 24, 2020 / 12:07 PM IST
ఇడుపులపాయ బంకర్‌లో కూర్చొని పాలించండి..జగన్‌కు యనమల సూచన

ఎక్కడి నుంచైనా పరిపాలించొచ్చని అంటున్నారు..కదా..అయితే.. ఇడుపులపాయ నుంచి పాలించండి అంటూ సెటైర్స్ వేశారు ఏపీ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ లీడర్ యనమల. అక్కడ బంకర్లలో కూర్చొని..ఫోన్‌లో మాట్లాడుకోవచ్చు..చక్కగా డబ్బులు లెక్కించుకోవచ్చు..అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. 2020, జనవరి 24వ తేదీ శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబు తన బృందంతో కలిసి రాజ్ భవన్‌కు వెళ్లారు. అక్కడ గవర్నర్‌తో భేటీ అయ్యారు. శాసనమండలిలో జరిగిన పరిణామాలు, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం యనమల మీడియాతో మాట్లాడుతూ..

సెలెక్ట్ కమిటీ అంటే ఎందుకంత భయం ? మీరంటే బల్డౌజ్ చేశారు ? తమ సభ్యుల మాట వినిపించుకోకుండా వెళ్లిపోయారు..సెలెక్ట్ కమిటీ బిల్లును రిజక్ట్ చేయదు ? కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే తెలుసుకుంటుందని వివరించారు యనమల. అనంతరం బిల్లును శాసనమండలి, శాసనసభ ముందుకు వస్తుందన్నారు. 

శాసనసమండలిలో జరిగిన పరిణామాలతో ప్రభుత్వం సీరియస్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో..మండలి రద్దు చేయాలనే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 2020, జనవరి 27వ తేదీన ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. అంతకంటే ముందు ఏపీ కేబినెట్ సమావేశమై..మండలి రద్దుపై చర్చిచంనుంది. అనంతరం జరిగే బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరపాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.

అసెంబ్లీ ఎదుట కేబినెట్ తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చించనున్నారు. మొత్తానికి మండలి రద్దుకే ఏపీ ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. గవర్నర్‌ను కలిసిన అనంతరం యనమల చేసిన విమర్శలపై వైసీపీ ఎలాంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి. 

Read More : మండే..మండలి : 27న ఏపీ కేబినెట్ మీటింగ్