వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు సాధ్యం కాదు : అంబటి

వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు సాధ్యం కాదు : అంబటి

YCP leader Ambati Rambabu is angry with SEC Nimmagadda Ramesh : ఎస్ ఈసీ నిమ్మగడ్డ రమేష్ పై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం (జనవరి 9, 2021) మీడియాతో మాట్లాడుతూ కరోనా రెండో దశ కనిపిస్తోందని తెలిపారు. దేశంలో ఇంకా భయాందోళనలు తగ్గలేదని పేర్కొన్నారు.

వ్యాక్సిన్ పంపిణీ కారణంగా ఎన్నికలు సాధ్యం కాదని ప్రభుత్వం చెప్పిందని పేర్కొన్నారు. కోవిడ్ టైంలో ఎన్నికలు నిర్వహించడం అవసరమా అని ప్రశ్నించారు. వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. రమేష్ కుమార్ మొండిగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 2021, జనవరి 8వ తేదీ శుక్రవారం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ షెడ్యూల్ విడుదల చేశారు. నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్ఈసీ వెల్లడించింది. దీంతో 2021, జనవరి 9వ తేదీ నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది.

పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంపై ఏపీ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కరోనా వ్యాక్సినేషన్‌కు సిద్ధమవుతున్న సమయంలో… షెడ్యూల్ ఇవ్వడం ఏంటని మండిపడుతోంది. కరోనా వ్యాక్సిన్ సన్నద్ధతలో అధికారయంత్రాంగం అంతా ఉందని, వ్యాక్సిన్ నేషన్ వల్ల స్థానిక ఎన్నికల నిర్వాహణ సాధ్యం కాదని ప్రభుత్వం వెల్లడిస్తోంది.