Kuppam: జాతర జరిపించి తప్పుకుంటానన్నా వినలేదు.. బయటకొచ్చిన వైసీపీ నేత పార్థసారథి సూసైడ్ సెల్ఫీ వీడియో

త్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం కుప్పం గ్రామంలో గంగమ్మ ఆలయ మాజీ చైర్మన్ గా పని చేసిన వైసీపీ నేత పార్థసారథి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న విషయం విధితమే.

Kuppam: జాతర జరిపించి తప్పుకుంటానన్నా వినలేదు.. బయటకొచ్చిన వైసీపీ నేత పార్థసారథి సూసైడ్ సెల్ఫీ వీడియో

Partha Sarathi

Kuppam : చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం కుప్పం గ్రామంలో గంగమ్మ ఆలయ మాజీ చైర్మన్ గా పని చేసిన వైసీపీ నేత పార్థసారథి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న విషయం విధితమే. పార్థసారథి ఆత్మహత్య స్థానికంగా వైసీపీలో కలకలం సృష్టిస్తుంది. వైసీపీ నేతల తీరుతోనే పార్థసారథి మృతిచెందాడన్న చర్చజోరుగా సాగుతుంది. గతంలో కుప్పంలోని తిరుపతి గంగమ్మ ఆలయ చైర్మన్ గా పార్థసారధి పనిచేశాడు. కుప్పం మున్సిపాలిటీ కాక ముందు వార్డు సభ్యునిగా రెండు సార్లు పనిచేశారు. వైసీపీలో క్రియాశీలకంగా పనిచేస్తూ వచ్చాడు. అయితే మున్సిపాలిటీ ఎన్నికల సమయంలో పోటీచేసేందుకు అవకాశం దక్కలేదు. తిరుపతి గంగమ్మ ఆలయ కమిటీలోనూ మరోసారి అవకాశం లేదని స్పష్టం కావడంతో పార్థసారథి తీవ్ర మనస్థాపంకు గురయ్యాడని, ఈ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడన్న వాదన వినిపించింది.

Kuppam: కుప్పం కోటపై ఎగిరిన వైసీపీ జెండా

పార్థసారథి ఆత్మహత్యపై పలు పుకార్లు షికార్లు చేశాయి. ఈ క్రమంలో పార్థసారథి ఆత్మహత్య వ్యవహారంపై సూసైడ్ సెల్ఫీ వీడియో బయటకొచ్చింది. ఈ సెల్ఫీ వీడియోలో తన ఆత్మహత్యకు గల కారణాలను పార్థసారథి వెల్లడించారు. కుప్పం గంగమ్మ ఆలయ చైర్మన్ గా రెండేళ్లు కొనసాగినప్పటికీ కరోనా కారణంగా జాతర చేయలేక పోయాయని, మరో నెలలో రానున్న జాతర జరిపించి పదవి నుంచి దిగిపోతానని వైసీపీ నేతలకు చెప్పినా నాకు అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

Kuppam: కుప్పం కోటపై ఎగిరిన వైసీపీ జెండా

గంగమ్మ గుడి చైర్మన్ పదవి కోసం రూ.35లక్షలు ఖర్చు చేశానని, పదవి ఇచ్చినందుకు రూ. 15 లక్షలు ఖర్చు చేశానని, బోర్డు ఏర్పాటు కోసం రూ. 10లక్షలు, ఆలయంలో మరమ్మతుల కోసం మరో పది లక్షలు అప్పు చేసి డబ్బులు వెచ్చించానని పార్థసారథి తన సూసైడ్ వీడియోలో వెల్లడించాడు. ఇప్పటికీ తెచ్చిన డబ్బులకు వడ్డీ కడుతున్నానని అన్నాడు. ఏడేళ్లుగా వైసీపీని నమ్ముకున్న నా వద్ద కూడా డబ్బులు తీసుకునే పదవి ఇచ్చారని, కొత్తగా పార్టీలోకి వస్తున్న నాయకులు వద్ద నుంచి కూడా డబ్బులు తీసుకుని పదవులు అమ్ముకున్నారని పార్థసారథి ఆవేదన వ్యక్తం చేశాడు. తాజాగా బయటకొచ్చిన పార్థసారథి సెల్ఫీ వీడియో స్థానిక వైసీపీలో కలకలం రేపుతోంది.