Sajjala Ramakrishna Reddy: ఏపీ ఉమ్మడిగా ఉండాలన్నదే మా పార్టీ విధానం.. అవకాశం వస్తే తొలుత స్వాగతించేది వైసీపీనే

రాష్ట్ర విభజనకు వైసీపీ తొలినుంచి వ్యతిరేకంగా పోరాడుతుందని, కుదిరితే మళ్లీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా కలిసి ఉండాలన్నదే మా పార్టీ విధానమని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

Sajjala Ramakrishna Reddy: ఏపీ ఉమ్మడిగా ఉండాలన్నదే మా పార్టీ విధానం.. అవకాశం వస్తే తొలుత స్వాగతించేది వైసీపీనే

sajjala ramakrishna reddy

Sajjala Ramakrishna Reddy: రాష్ట్ర విభజనకు వైసీపీ తొలినుంచి వ్యతిరేకంగా పోరాడుతుందని, కుదిరితే మళ్లీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా కలిసి ఉండాలన్నదే మా పార్టీ విధానమని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన తీరును సవాల్ చేస్తూ సుప్రీంలో కేసుపై ఉండవల్లి చేసిన విమర్శలకు సజ్జల స్పందించారు. విభజన చట్టం అసంబద్ధం అని సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉందని గుర్తుచేశారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మేము తొలినుంచి పోరాడుతున్నామని తెలిపారు. కానీ, ఉండవల్లి పనిగట్టుకొని జగన్ వైపు చూపించినట్లు తెలుస్తోందని సజ్జల అన్నారు.

Sajjala On Sharmila Arrest : షర్మిల అరెస్ట్ బాధాకరం.. వైసీపీకి షర్మిల పార్టీకి సంబంధం లేదు-సజ్జల

అప్పట్లో తెదేపా, కాంగ్రెస్, బీజేపీ విభజనకు అనుకూలంగా వ్యవహరించాయని, కానీ, వైసీపీ మాత్రమే తొలినుంచి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాడిందని, పోరాడుతుందని అన్నారు. మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాగలిగితే తొలుత స్వాగతించేది వైకాపానే అని సజ్జల అన్నారు. విభజనకు వ్యతిరేకంగా కోర్టుల్లో మా వాదనలు బలంగా వినిపిస్తామని, రాష్ట్ర విభజనను వెనక్కి తిప్పాలి , లేదంటే సరిదిద్దాలని గట్టిగా కోరతామన్నారు.

Sajjala Ramakrishna Reddy: విజయసాయిరెడ్డికి ఒక్కరే కూతురు ఉన్నారు.. అరెస్టు అయ్యింది ఆయన అల్లుడు కాదు: సజ్జల

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కలసి ఉండాలన్నదే ఇప్పటికీ మా విధానమన్న సజ్జల.. రాష్ట్ర విభజన చేసిన తీరుపైనే న్యాయస్థానంలో కేసు వేశారన్నారు.  విభజనచట్టంలో హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేస్తూనే ఉందన్నారు. రెండు రాష్ట్రాలు కలసి ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తే అంతకంటే కావాల్సింది ఏముంది అంటూ సజ్జల పేర్కొన్నారు.