భార్యకు కార్పొరేషన్ టికెట్ ఇవ్వలేదని వైసీపీ నేత ఆత్మహత్యాయత్నం

భార్యకు కార్పొరేషన్ టికెట్ ఇవ్వలేదని వైసీపీ నేత ఆత్మహత్యాయత్నం

YCP leader Suicide attempt : భార్యకు కార్పొరేషన్ టికెట్ ఇవ్వలేదని ఓ వైసీపీ నేత ప్రాణాలు తీసుకోబోయారు. హిందూపురం మున్సిపల్‌ 13వ వార్డు నుంచి తన భార్య శోభకు టికెట్ కేటాయించలేదనే మనస్థాపంతో బలవన్మరణానికి పాల్పడ్డారు.

అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన వైసీపీ నేత బాబుల్‌ రెడ్డి.. ఎమ్మెల్సీ ఇక్బాల్ ఇంటి వద్దే విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

టికెట్‌ శోభకే వస్తుందనే నమ్మకంతో బాబుల్‌ రెడ్డి వారం రోజులుగా డివిజన్‌లో ప్రచారం చేస్తున్నారు. వైసీపీ అధిష్టానం శోభకు కాకుండా ఇతరులకు టికెట్‌ కేటాయించింది. అయితే ఈ రోజు తనకు టికెట్‌ రాలేదని.. వేరే వారికి టికెట్‌ కేటాయించారని భార్య చెప్పడంతో బాబుల్ రెడ్డి బలవన్మరణం చేసుకున్నారు.