ఎన్నికల్లో ప్రత్యర్థికి ఓట్లు వేయించారని..గ్రామ సేవకుడి కుటుంబంపై వైసీపీ నేతలు దాడి

ఎన్నికల్లో ప్రత్యర్థికి ఓట్లు వేయించారని..గ్రామ సేవకుడి కుటుంబంపై వైసీపీ నేతలు దాడి

YCP leaders attack on village servant’s family : కర్నూలు జిల్లా అవుకు మండలం కాశీపురంలో గ్రామ సేవకుడి కుటుంబంపై దాడి జరిగింది. వైసీపీ నాయకులే తమపై దాడి చేశారని బాధితులు పోలీసుకుల ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, గ్రామ సేవకుల సంఘంతో కలిసి తహసీల్దార్‌ కార్యాలయం నుంచి పోలీస్‌ స్టేషన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. స్టేషన్‌ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ప్రత్యర్థికి ఓట్లు వేయించామని ఆరోపిస్తూ దాడి చేశారని భాదితులు ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. పంచాయతీ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల తరపున ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యే.. ఆ గ్రామంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వైసీపీకి వ్యతిరేకంగా నామినేషన్ వేస్తే ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామంటూ ఎమ్మెల్యే జోగి రమేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వేరే పార్టీ నుండి వార్డు మెంబర్‎గా పోటీ ‌చేసినా.. ప్రభుత్వ పథకాలు తీసి పారేయండంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

మన పథకాలు తీసుకుంటూ.. మనకు వ్యతిరేకంగా ఎలా నిలబడతారంటూ తీవ్రంగా మండిపడ్డారు. సీఎం జగన్‌ అనేక సంక్షేమ పథకాలు అమలు‌ చేస్తున్నారని ఆయన చెప్పారు. అయినా కూడా వైసీపీకి వ్యతిరేకంగా నామినేషన్ వేస్తే.. పెన్షన్, కాపు నేస్తం, అమ్మఒడి పథకాలు కట్ చేసి పారేస్తాం అని హెచ్చరించారు. జోగి రమేష్ అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి.