Andhra Pradesh : వాచ్‌మెన్ పోస్టు కోసం పొట్టుపొట్టుగా కొట్టుకున్న వైసీపీ నేతలు

వైసీపీ నేతలు వారిలో వారే చితక్కొట్టుకున్నారు. రెండు వర్గాలుగా విడిపోయిన నేతలు స్కూల్లో బాహాబాహీకి దిగారు.

Andhra Pradesh : వాచ్‌మెన్ పోస్టు కోసం పొట్టుపొట్టుగా కొట్టుకున్న వైసీపీ నేతలు

Andhra Pradesh

Andhra Pradesh : కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం ఆర్బీపట్నంలో వైసీపీలో వర్గ వేభేదాలు బయటపడ్డారు. స్థానికంగా ఉన్న హైస్కూల్ ఆవరణలో వైసీపీ నేతలు బాహాబాహీకి దిగాయి.స్థానిక స్కూల్ వాచ్ మెన్ పోస్టు కోసం పొట్టుపొట్టుగా కొట్టుకున్నారు స్థానిక వైసీపీ నేతలు. ఒకే పార్టీవారు వారిలో వారే దారుణంగా కొట్టుకోవటంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తత నెలకొంది. స్కూల్ వాచ్ మెన్ పోస్టు తమ వారికి ఇవ్వాలని ఓ వర్గం వారు కాదు మాకే ఇవ్వాలని మరో గ్యాంగ్ కొట్టుకున్నారు. ఎంపీపీ సత్యవతి, సీనియర్ నేత ముత్యాల రాజబ్బాయి వర్గీయుల మధ్య స్థానిక స్కూల్లో వాచ్ మెన్ పోస్టు గురించి వాగ్వాదానికి దిగారు. మీ దమ్ము ఎంతో చూసుకుందాం రండీ అంటూ సవాళ్లు విసురుకున్నారు.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ నేతల్లో వర్గ విభేధాలు బయపటడుతున్నాయి. చిన్నస్థాయి నేతల నుంచి పెద్ద స్థాయి నేతల వరకు ఏదోక అసంతృప్తులు బయటపడుతున్నాయి. దీంతో వైసీపీ అన్నా..జగన్ అన్నా ప్రాణం పెడతాను అనేవారే అసంతృప్తులతో రగిలిపోతున్నారు. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెబల్ గా మారారు.దీంతో పార్టీ వారిపై సస్పెన్షన్ వేటు వేసింది.  తాజాగా జగన్ కు బంధువు అయిన బాలినేని కూడా అసంతృప్తిగా ఉన్నారని వెల్లడి అయ్యింది.మంత్రి పదవి నుంచి తప్పించిన నాటి నుంచి గుర్రుగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ధిక్కార స్వరం వినిపించారు.

Balineni Srinivasa Reddy: బాలినేని శ్రీనివాస్ రెడ్డి పయనం ఎటు.. తర్వాతి అడుగు ఎటువైపు?

బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ప్రకాశం జిల్లా, తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ పదవికి ఆయన రాజీనామా చేశారు. మంత్రి పదవి నుంచి తప్పించిన నాటి నుంచి ఆయన గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణలో భాగంగా తనను మంత్రి పదవి నుంచి తప్పించి.. ఆదిమూలపు సురేశ్ ను కొనసాగించడం పట్ల ఆయన ఆగ్రహంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.