Undavalli : బాబు ఇంటి వద్ద హై టెన్షన్, అయ్యన్న వ్యాఖ్యలపై జోగి రమేశ్ తీవ్ర ఆగ్రహం

చంద్రబాబు నాయుడు నివాసం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ, టీడీపీ వర్గాలు బాహాబాహికి దిగాయి.

Undavalli : బాబు ఇంటి వద్ద హై టెన్షన్, అయ్యన్న వ్యాఖ్యలపై జోగి రమేశ్ తీవ్ర ఆగ్రహం

Babu House

Undavalli Chandrababu House : చంద్రబాబు నాయుడు నివాసం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ, టీడీపీ వర్గాలు బాహాబాహికి దిగాయి. ఇరు పార్టీల కార్యకర్తలు పార్టీ జెండాల కర్రలతో కొట్టుకున్నారు. తోపులాటలు, వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రక్తంగా మారిపోయింది. బాబు నివాసం వైపు చొచ్చుకపోవాలని చూసిన వైసీపీ కార్యకర్తలను అక్కడనే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. ఓ దశలో లాఠీఛార్జీ చేశారు కూడా. బాబు నివాసం వద్ద టీడీపీ నేతలు..అవతలి వైపు…వైసీపీ వర్గాలు మోహరించాయి. ఎప్పుడు ఏ పరిస్థితి చోటు చేసుకుంటుందనే టెన్షన్ నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు భారీగా మోహరించారు. దీనికంతటికి కారణం టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలే కారణం.

Read More : Raju : రాజు నేరచరితుడే.. ఎల్బీనగర్ లో చోరీకి యత్నం

బాబు ఇంటికి జోగి రమేశ్ : –
అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్. ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని, సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఓ వీడియోను కూడా విడుదల చేశారాయన. అనంతరం 2021, సెప్టెంబర్ 17వ తేదీ శుక్రవారం ఉదయం వైసీపీ కార్యకర్తలతో జోగి రమేశ్ …బాబు ఇంటికి చేరుకున్నారు. జోగి రమేశ్ వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న టీడీపీ నేతలు అక్కడకు చేరుకున్నారు. బుద్ధా వెంకన్న, పట్టాభి, ఎలూరి సాంబశివరావు తదితరులు అక్కడకు చేరుకున్న వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న, జోగి రమేశ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరువర్గాలు తీవ్రస్థాయిలో వాగ్వాదానికి, ఘర్షణలకు దిగారు. బాబు ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించగా…పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో జోగి రమేశ్ కాసేపు వాగ్వాదానికి దిగారు.

Read More : Ramya Krishnan : శివగామి బర్త్‌డే సెలబ్రేషన్స్.. స్టార్స్ అంతా ఒకే చోట..

దాడి చేయిస్తారంటూ జోగి రమేశ్ ఆగ్రహం : –
ఈ సందర్భంగా..మీడియాతో జోగి రమేశ్ మాట్లాడుతూ…చంద్రబాబు సమక్షంలో అయ్యన్నపాత్రుడు జగన్ ను దూషించారని, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్ జగన్ ను ఇష్టమొచ్చినట్లు మాట్లాడరని తెలిపారు. సీం జగన కు చంద్రబాబు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ వ్యాఖ్యలకు నిరసన తెలిపేందుకు తాను ఇక్కడకు వచ్చానని, కానీ…తనపై దాడి చేయిస్తారా ? ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి ఇలాగేనా వ్యవహరించేది అంటూ మండిపడ్డారు. క్షమాపణ చెప్పకుంటే చంద్రబాబు, లోకేశ్ ను ఏపీలో తిరగనివ్వమన్నారు.

Read More : మాయగాడు.. అమ్మాయిలను ట్రాప్ చేస్తున్న BTech స్టూడెంట్

వైసీపీ నాయకులే రాళ్లు వేశారు : –
వైసీపీ నాయకులు తమపై రాళ్లు విసిరారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కొంతమంది అల్లరి మూకలను తీసుకొచ్చి జోగి రమేశ్ హడావుడి చేస్తున్నరని, అతను చిల్లర రాజకీయాలు మానుకోవాలని వెల్లడిస్తున్నారు. ముష్టి రాజకీయాలు మానుకోకపోతే..తాము కూడా సీఎం ఇంటిని ముట్టడిస్తామన్నారు. చంద్రబాబు నాయుడి ఇంటికి తాము రక్షణగా నిలుస్తామన్నారు. పరిస్థితి చేయి దాటుతుండడంతో…జోగి రమేశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన కారు కూడా ధ్వంసమైంది.