Karanam Dharmashree : వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి టీచర్ ఉద్యోగం

తనకు టీచర్ గా ఉద్యోగం రావడం ఆనందంగా ఉందన్నారు. టీచర్ కావాలన్న ఆశతో మూడు సార్లు డిఎస్పీ రాశానని తెలిపారు. మూడోసారి అర్హత సాధించానని పేర్కొన్నారు. తనకు సోషల్, ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టమన్నారు.

Karanam Dharmashree : వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి టీచర్ ఉద్యోగం

Karanam

Karanam Dharmashree : వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి టీచర్ ఉద్యోగం వచ్చింది. 1998లో డీఎస్సీ రాసిన ప్రస్తుత చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. 1998 డీఎస్సీ వివాదం కోర్టులో ఎట్టకేలకు పరిష్కారం కావడంతో అప్పట్లో ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థుల ఫైల్‌పై సీఎం జగన్ తాజాగా సంతకం చేశారు. ఉద్యోగానికి ఎంపికైన వారి జాబితాలో కరణం ధర్మశ్రీ పేరు కూడా ఉంది. అప్పట్లో డీఎస్సీకి ఎంపికైన వారిలో కొందరు కూలీలుగా మారగా, మరికొందరు వేర్వేరు వృత్తుల్లో స్థిరపడ్డారు. అయితే ధర్మశ్రీ మాత్రం రాజకీయాల్లోకి వచ్చారు. రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు.

తాను టీచర్‌గా ఎంపిక కావడంపై ఎమ్మెల్యే ధర్మశ్రీ 10టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. డీఎస్సీ రాసినప్పుడు తనకు 30 సంవత్సరాలని గుర్తు చేసుకున్నారు. మద్రాసు అన్నామలై యూనివర్సిటీలో బీఈడీ చదివానని, ఉపాధ్యాయుడిగా స్థిరపడాలని అనుకున్నానని పేర్కొన్నారు. 1998 డీఎస్సీ వివాదాల్లోకి జారుకోవడంతో ఆ తర్వాత బీఎల్ అభ్యసించడం మొదలుపెట్టినట్టు చెప్పారు.

Andhra Pradesh: 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఏపీ ప్ర‌భుత్వం శుభ‌వార్త.. ఫైల్‌పై జ‌గ‌న్ సంత‌కం

తనకు టీచర్ గా ఉద్యోగం రావడం ఆనందంగా ఉందన్నారు. టీచర్ కావాలన్న ఆశతో మూడు సార్లు డిఎస్పీ రాశానని తెలిపారు. మూడోసారి అర్హత సాధించానని పేర్కొన్నారు. తనకు సోషల్, ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టమన్నారు. నాడు-నేడులో భాగంగా స్కూల్లో కొన్ని సార్లు మాస్టర్ గా పాఠాలు చెప్పానని గుర్తు చేశారు. డిఎస్సీ అర్హత సాధించినా ఉద్యోగం రాకపోవడంతో రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. అనేక పోరాటాలు చేశానని పేర్కొన్నారు.

ఎందరో సీఎంలు చేయ్యలేనిది సీఎం జగన్ చేశారని కొనియాడారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని చెప్పారు. కానీ, అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఉద్యోగులతో ఆటలాడకూడదని సూచించారు. అర్హత సాధిస్తే ఉద్యోగం కల్పించాలన్నారు. ఇప్పటికే చాలా మందికి రిటైర్డ్ వయస్సు వచ్చేసిందని వెల్లడించారు. ఇది కొంతమందికి మంచి అవకాశం అన్నారు. టీచర్ కాలేకపోయానని బాధ ఉన్నా..రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయ్యడం సంతృప్తగానే ఉందని పేర్కొన్నారు.