MLA Roja: అప్పుడు అభిమానంతో గెలిపించారు.. ఇప్పుడు అభివృద్ధి చూసి ఓట్లేశారు -ఎమ్మెల్యే రోజా

బద్వేల్ ఉపఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ ఘనవిజయం సాధించారు. తన భర్త చనిపోవడంతో వచ్చిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన సుధ గెలుపొందారు.

MLA Roja: అప్పుడు అభిమానంతో గెలిపించారు.. ఇప్పుడు అభివృద్ధి చూసి ఓట్లేశారు -ఎమ్మెల్యే రోజా

Roja

MLA Roja: బద్వేల్ ఉపఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ ఘనవిజయం సాధించారు. తన భర్త చనిపోవడంతో వచ్చిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన సుధ గెలుపొందారు. ఏకంగా 76.25 శాతం ఓట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించగా.. 90,533 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి డాక్టర్‌ సుధ ఘన విజయం సాధించారు. మొదటి నుంచి ప్రతి రౌండ్‌లోనూ వైసీపీ ఆధిక్యంలో ముందుకు సాగింది.

అభివృద్ధి పనులకే తొలి ప్రాధాన్యత: డా. సుధ

వైసీపీకి మొత్తం 1,12,211 ఓట్లు పోలవ్వగా.. బీజేపీకి 21వేల 678 ఓట్లు వచ్చాయి, కాంగ్రెస్‌కు మొత్తం 6,235ఓట్లు మాత్రమే పోలయ్యాయి. పోస్టల్‌ బ్యాలెట్‌లోనూ వైసీపీ మెజారిటీ ఓట్లు దక్కించుకుంది. బద్వేల్‌లో బీజేపీ, కాంగ్రెస్‌‌లకు కనీసం ఓట్లు పడకపోవడంతో వైసీపీకి భారీ మెజారిటీ దక్కింది.

ఇండియాలో ఫస్ట్ రూఫ్ టాప్ థియేటర్.. కారులోంచే సినిమా చూడొచ్చు

ఈ విజయంపై ఎమ్మెల్యే రోజా స్పందించారు. సీఎం వైఎస్‌ జగన్‌‌పై అభిమానంతో 2019 ఎన్నికల్లో 45 వేల మెజారిటీ ఇస్తే, జగన్‌ పరిపాలన, అభివృద్ధి చూసి 90 వేలకు పైగా మెజారిటీ ఇచ్చారని అన్నారు ఎమ్మెల్యే రోజా. బద్వేల్‌లో ప్రజలు సుపరిపాలనకు పట్టం కట్టారని అన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన మూడు పార్టీలు కలిసి కుట్రలు చేసినా.. ప్రజలు వైసీపీ వైపే నిలబడ్డారని అన్నారు.

పవన్ కళ్యాణ్‌ను అభినందించిన కొడాలి నాని.. మోదీకి జానీ సినిమా చూపించాలని సూచన

ఏ సెంటరైనా.. సింగిల్‌ హ్యాండ్‌తో వైసీపీని ప్రజలు గెలిపిస్తున్నారని, 2024ఎన్నికలలో కూడా వైసీపీ గెలుపు ఖాయమని అన్నారు. బద్వేల్ ఉపఎన్నికల్లో 90వేలకు పైగా మెజారిటీ ఇచ్చిన ప్రజలకు పాదాభివందనం అన్నారు రోజా. టీడీపీకి రాబోయే రోజుల్లో ఒక్క సీటు కూడా దక్కే పరిస్థితి లేదన్నారు ఎమ్మెల్యే రోజా.