జగన్.. నన్ను హత్య చేశాడని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వు బాబూ

  • Published By: madhu ,Published On : February 9, 2020 / 07:55 AM IST
జగన్.. నన్ను హత్య చేశాడని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వు బాబూ

తనను చంపేశారని..సీఎం జగన్‌పై చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు పీఎస్‌లో ఫిర్యాదు చేసినా చేస్తాడని..చనిపోయినా..ఆత్మ వచ్చి కంప్లయింట్ ఇస్తుందని..మేనేజ్ చేయడంలో బాబు దిట్ట అంటూ ఫైర్ అయ్యారు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్. ఎందుకంటే..కొన్ని రోజులుగా మూడు రాజధాను అంశం రగులుతుండగానే..కియా పరిశ్రమ తరలిపోతోందంటూ..టీడీపీ కొత్త విషయం తెరమీదకు తెచ్చింది.

కానీ ఎక్కడకు తరలిపోవడం లేదని..కేవలం టీడీపీ కుట్ర అంటూ వైసీపీ ప్రభుత్వం వెల్లడించింది. రాయిటర్స్ కథనాన్ని టీడీపీ చూపెట్టింది. అయితే..అనూహ్య పరిణామాల మధ్య రాయిటర్స్ ఈ కథనాన్ని విరమించుకుంది. దీంతో వైసీపీ నేతలు టీడీపీ ఎంపీలపై కస్సుబుస్సులాడుతున్నారు. ఇప్పుడు ఏమి సమాధానం చెబుతారంటూ..ఫైర్ అవుతున్నారు. 
దీనిపై ఎంపీ గోరంట్ల మాధవ్‌తో 10tv మాట్లాడింది. కియా పరిశ్రమ తరలిపోతోందంటూ..చంద్రబాబు ఆడిన నాటకాలకు తెరపడిందన్నారు. ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ఉన్నది లేనట్లు..లేనిది ఉన్నట్లు చెప్పడంలో బాబు దిట్ట అని ఎద్దేవా చేశారు. 

కియా ఫ్యాక్టరీకి తాము భూమి, నీళ్లివ్వడం జరిగిందన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని తాను అడిగితే దానికి వక్రభాష్యం చెబుతారని విమర్శించారు. ఇంకా రాయితీలు, ఇతరత్రా సౌకర్యాలు కల్పిస్తామని సీఎం జగన్ చెప్పిన దానికి కియా ప్రతినిధులు అంగీకరించారని తెలిపారు. ఒక అబద్దాన్ని నిజం చేయాలని బాబు ప్రయత్నించి భంగపడ్డారని, అతని కుత్ర, కుతంత్రాలు రాయిటర్స్ వెబ్ సైట్‌లో రాయించారని, ఈ ప్రయత్నం విఫలం చెందితే..లోక్ సభలో ఆ పార్టీ  ఎంపీలతో మాట్లాడించారని వెల్లడించారు. అందరూ గమనిస్తున్నారని, చావు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు ఎంపీ మాధవ్.