Avinash Reddy : సీబీఐకి ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి లేఖ

వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. మంగళవారం విచారణకు హాజరు కాలేనని లేఖలో పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున విచారణకు రాలేనని చెప్పారు.

Avinash Reddy : సీబీఐకి ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి లేఖ

avinash (1)

Avinash Reddy : వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. మంగళవారం విచారణకు హాజరు కాలేనని లేఖలో పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున విచారణకు రాలేనని చెప్పారు. అవినాశ్ రెడ్డి లేఖకు ఇంకా సీబీఐ రిప్లై ఇవ్వలేదు. సోమవారం వివేక హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. తుది తీర్పు వెల్లడయ్యే వరకు అవినాష్ పై తదుపరి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. తీర్పు వెల్లడించేంత వరకు అవినాష్ ను అరెస్టు చేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది.

పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో మంగళవారం సీబీఐ విచారణకు హాజరు కాకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును అవినాష్ తరపు న్యాయవాది కోరారు. సీబీఐకి లేఖ పెట్టుకోవాలని హైకోర్టు సూచించింది. సీబీఐ కార్యాలయం వద్ద అవినాష్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తి చేసింది.  సునీత పిటిషన్ వెనుక సీబీఐ హస్తం ఉందని అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది ఆరోపించారు. సునీత అభియోగం వెనకాల రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని పేర్కొన్నారు.

MP Avinash Reddy : ఆస్తుల కోసమే వివేకా హత్య.. ఎంపీ అవినాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

వివేక హత్య అనంతరం అనుకూలంగా ఉన్న సునీత ఏడాది తర్వాత ఆరోపణలు చేస్తుందన్నారు. వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి, వివేక రెండో భార్య షమీంల పాత్రపై సీబీఐ విచారణ చేయడం లేదని చెప్పారు. అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని దర్యాప్తు జరగాలని కోరారు. వివేక హత్య కేసు డైరీని షీల్డ్ కవర్లో కోర్టుకు సీబీఐ సమర్పించింది. 35 సాక్షుల స్టేట్మెంట్లు, 10 డాక్యుమెంట్ల , హార్డ్ డిస్క్ లు కోర్ట్ కు సమర్పించింది. స్పాట్ లో దొరికిన లెటర్, ఎఫ్ ఎస్ ఎల్ నివేదికను సైతం సిబిఐ కోర్ట్ కు సమర్పించింది.

అవినాశ్ కేసులో వీడియోగ్రాఫి అవసరం లేదని తెలిపింది. అవినాశ్ ను 160 సీఆర్పీసీ కింద విచారిస్తున్నామని సీబీఐ చెప్పింది. వైఎస్ అవినాశ్ కోర్టు ద్వారా విచారణకు రాలేదు.. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నోటీసులతో వచ్చాడని తెలిపింది. కో రెసివ్ స్టెప్స్ వద్దనడానికి కూడా అవకాశం లేదని వెల్లడించింది. కోరేసిన్ స్టెప్స్ అంటే అర్థం ఏంటో కూడా ఇప్పటివరకు కోర్టు వివరించ లేదని తెలిపింది.