విజయవాడ మేయర్ పీఠం..టీడీపీకి భంగపాటు

విజయవాడ మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠకు తెరపడింది. ఈ స్థానం కూడా వైసీపీ ఖాతాలో పడిపోయింది.

విజయవాడ మేయర్ పీఠం..టీడీపీకి భంగపాటు

Vijayawada

vijayawada mayor Seat : విజయవాడ మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠకు తెరపడింది. ఈ స్థానం కూడా వైసీపీ ఖాతాలో పడిపోయింది. ఇక్కడ టీడీపీ గెలుస్తుందని ఆ పార్టీకి చెందిన నేతలు ధీమా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కానీ..ప్రజలు ఫ్యాన్ గుర్తుపై ఓటేశారు. దీంతో మేయర్ పీఠం వైసీపీ కైవసం చేసుకుంది. 64 డివిజన్లలో 33 డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. మరో రెండు స్థానాల్లో విజయం సాధిస్తే..మేయర్ పీఠంపై వైసీపీ కూర్చొనుంది. 9 స్థానాల్లో మాత్రమే టీడీపీ విజయం సాధించింది. మూడో రౌండ్ లెక్కించాల్సి ఉంది. ఈ స్థానం కూడా వైసీపీ గెలుచుకొనే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

వైసీపీ, టీడీపీ నువ్వా – నేనా అన్నట్లుగా వ్యవహరించారు. ప్రచారం నుంచి మొదలుకుని ఫలితాలు వెలువడే వరకు ఉత్కంఠ నెలకొంది. కానీ..అందరి అంచనాలు తలకిందులు చేస్తూ..వైసీపీకే ఓటర్లు పట్టం కట్టారు. 45 నుంచి 50 స్థానాలు వైసీపీ గెలుచుకొంటుందని నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పశ్చిమ నియోజకవర్గంలో 34వ డివిజన్‌ నుంచి టీడీపీ నుంచి విజయలక్ష్మి, వైసీపీ నుంచి పుణ్యశీల పోటీపడ్డారు. ఇక్కడ పుణ్యశీల సిట్టింగ్ కార్పొరేటర్‌. పైగా వైసీపీ తరపున మేయర్‌ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్నారు. అయితే టీడీపీ తరపున మేయర్‌ అభ్యర్థిగా ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత పేరును టీడీపీ ప్రకటించింది. కేశినేని శ్వేత 11వ డివిజన్‌ నుంచి పోటీ చేశారు.
విజయవాడ మేయర్‌ పీఠం దక్కాలంటే మ్యాజిక్‌ ఫిగర్‌ 33.. వైసీపీ నేతలు తమకు ఈ సంఖ్య దాటి డివిజన్లు వస్తాయని లెక్కలు వేసుకుంటున్నారు. అనుకున్నట్లుగానే జరిగింది. మేయర్‌ పీఠం తమదేనన్న ధీమాతో ఉన్న టీడీపీ నాయకులు కలలు