రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై కీలక వీడియో రిలీజ్ చేసిన వైసీీపీ

రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై వైసీపీ వీడియో ప్రజంటేషన్ ఇచ్చింది. అమరావతిలో భూముల స్కామ్ జరిగిందని చెబుతూ అందుకు సంబంధించిన అక్రమాల ఆధారాలు,

  • Published By: veegamteam ,Published On : January 2, 2020 / 12:10 PM IST
రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై కీలక వీడియో రిలీజ్ చేసిన వైసీీపీ

రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై వైసీపీ వీడియో ప్రజంటేషన్ ఇచ్చింది. అమరావతిలో భూముల స్కామ్ జరిగిందని చెబుతూ అందుకు సంబంధించిన అక్రమాల ఆధారాలు,

రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై అధికార వైసీపీ వీడియో ప్రజంటేషన్ ఇచ్చింది. అమరావతిలో భూముల స్కామ్ జరిగిందని చెబుతూ అందుకు సంబంధించిన అక్రమాల ఆధారాలు, వీడియోను వైసీపీ విడుదల చేసింది. ఈ వీడియో నిడివి 21 నిమిషాలు ఉంది. టీడీపీ ప్రభుత్వం హయాంలో చంద్రబాబు, టీడీపీ నేతలు ఏ విధంగా ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారో ఆ వీడియోలో చూపించారు.

రాజధాని పేరుతో అనేక అక్రమాలు జరిగాయని వైసీపీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. తక్కువ రేట్లకు రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారని వారు చెప్పారు. ల్యాండ్ పూలింగ్ భూములకు బదులుగా ఇచ్చే ప్లాట్లలో కూడా అవినీతి జరిగిందన్నారు. రాజధాని ప్రకటనకు ముందే పెద్ద ఎత్తున ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్నారు. 

అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ గురించి కొంత కాలంగా పెద్ద రచ్చ జరుగుతోంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. రాజధాని పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాజధాని ప్రకటనకు ముందే అమరావతి ప్రాంతంలో ల్యాండ్ స్కామ్ జరిగిందన్నారు. అయితే ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలను టీడీపీ నేతలు ఖండించారు. అదంతా అవాస్తవం అన్నారు.

దీంతో అధికార పార్టీ నేతలు మరో అడుగు ముందుకేసి.. ఇన్ సైడర్ ట్రేడింగ్ కు సంబంధించి ఆధారాలతో కూడిన వీడియోని మీడియాకి రిలీజ్ చేశారు. ఇదీ టీడీపీ నేతల నిజ స్వరూపం అని చెప్పారు. దీనికి టీడీపీ నేతల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.

* రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై వైసీపీ వీడియో ప్రజంటేషన్
* అమరావతిలో ల్యాండ్ స్కామ్ పై 21 నిమిషాల వీడియో విడుదల
* జూన్ 1, 2014 నుంచి డిసెంబర్ 31, 2014 వరకు ఇన్ సైడర్ ట్రేడింగ్
* బినామీ పేర్లతో కొన్న భూములు పోతాయన్న భయం పట్టుకుంది
* గుంటూరు జిల్లాలో 2279 ఎకరాలు, కృష్ణా జిల్లాలో 1790 ఎకరాలు కొనుగోలు
* అమరావతి రాజధాని ప్రకటనకుముందే పెద్ద ఎత్తున భూములు కొనుగోలు
* మొత్తం 4069.95 ఎకరాల భూమి కొనుగోలు
* ఇన్నర్ రింగ్ రోడ్ కూడా భూములకు అనుకూలంగా కట్టాలనుకున్నారు

* 800మంది తెల్లరేషన్ కార్డుదారులు రాజధానిలో భూములు కొన్నారు
* 800మంది తెల్లరేషన్ కార్డుదారుల్లో 60మంది తెలంగాణకు చెందిన వారు
* రాజధాని ప్రకటన తర్వాత కూడా భారీగా భూములు కొనుగోలు
* సీఆర్డీఏ పరిధిని విస్తరించి భూముల విలువ పెంచారు
* రైతులపై చంద్రబాబు, పవన్ ది కపట ప్రేమ
* అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారు
* ఉద్యమాల పేరుతో చంద్రబాబు రైతులను రెచ్చగొడుతున్నారు
* రాజధాని ప్రాంత రైతులను చంద్రబాబు మోసం చేశారు

* ఎక్కడైనా రాజధాని కోసం భూములు కావాలి.. కానీ భూముల కోసం రాజధాని ఏర్పాటు చేసిన ఘతన చంద్రబాబుదే
* రైతులను ఆత్మహత్యలకు ప్రేరేపించేలా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారు
* హైదరాబాద్ పై పదేళ్లు హక్కున్నా వదిలేసి వచ్చేశారు
* రాజధాని రైతులకు వైసీపీ అండగా ఉంటుంది
* రైతులకు న్యాయం చేస్తాం.. బినామీలకు, వ్యాపారులకు కాదు